Sunday, September 20, 2026 03:10 AM
Sunday, September 20, 2026 03:10 AM

భారత క్రికెట్ కు పట్టిన దరిద్రం గౌతమ్ గంభీర్

ఒంటెద్దు పోకడలతో భారత జట్టు లయను కోల్పోయేలా చేసాడు. “వెర్రి వేయి తలలు” అన్నట్టుగా ఉన్నాయి గౌతమ్ గంభీర్ విధానాలు. పిచ్చోడి చేతిలో రాయిలా గౌతం చేతిలో ఇండియన్ క్రికెట్ టీమ్. గౌతమ్ గంభీర్ విధానాలతో భారత క్రికెట్ జట్టు పయనం ఎటు వెళ్ళనుందో..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఒకప్పుడు 140 కోట్ల ప్రజల్లో 11 మంది ప్రతిభావంతులు లేరా..? అనిపించేది. మేనేజ్మెంట్లో కాస్త మార్పు రావడం, IPL పుణ్యమా అని ఎందరో ప్రతిభావంతులు బయటకు వచ్చారు. IPL పుణ్యంతో దేశ ప్రజల నుండి, క్రికెట్ ప్రేమికుల నుండి వారి ప్రతిభను దాచలేకపోయారు. ఎంతో కొంత పారదర్శకత ఉండడం వల్ల ప్రపంచ క్రికెట్ జట్లలో భారత జట్టు ఒక మేటి జట్టుగా, విధ్వంసకర జట్టుగా ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో గౌతం గంభీర్ రూపంలో దరిద్రం పట్టింది.

Also Read : జట్టులోనే పనికిరాని వాడ్ని కెప్టెన్ చేస్తారా..?

ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా, మంచి కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను కొంపలు మునిగిపోతున్నట్టుగా జట్టు నాయకుడి బాధ్యత నుండి తప్పించడం పెద్ద తప్పైతే.. రన్ మిషన్ గా, క్రికెట్ ప్రపంచంలో గొప్ప ఆటగాడిగా కొనియాడబడుతూ మంచి ఫిట్నెస్ మరియు ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీను తప్పించడం మరో ఘోర తప్పిదం. వాళ్ల అంగీకారం లేకుండా రిటైర్మెంట్…… ఆటగాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినేలా విపరీత ప్రయోగాలు చేస్తూ జట్టు సభ్యుల స్థానాల్లో మార్పులతో జట్టు తమ లయను కోల్పోయేలా చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నాడో..!?

గౌతం గంభీర్ ను కోచ్ పదవి నుండి ఎంత తొందరగా తప్పిస్తే ఇండియన్ క్రికెట్ కు అంత మంచిది. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని మెంటర్ గా బాధ్యతలు అప్పగించడం ద్వారా భారత జట్టులో ప్రతిభను మరింతగా తీర్చిదిద్దవచ్చు.

కోచ్ పదవి అంటే.. రాహుల్ ద్రావిడ్ కష్టాన్ని తన ఖాతాలో వేసుకున్నతంత సులువు కాదని గౌతమ్ గంభీర్ గుర్తిస్తే మంచిది.

Content Credits: అబ్దుల్ గఫూర్

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్