Monday, February 16, 2026 12:49 AM
Monday, February 16, 2026 12:49 AM

ఆ యంగ్ స్పీడ్ గన్ ఎక్కడ..? గంభీర్ మర్చిపోయాడా..?

క్రికెట్ సహా ఇతర క్రీడలు ఏవైనా సరే యువకులకు అవకాశాలు ఇవ్వాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు పక్కన పెట్టి ఆటగాళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో ఇటువంటివి చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం క్రికెట్లో తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ విభాగం విషయంలో ఒక అవగాహన లేకుండా అతను వ్యవహరిస్తున్నాడనే విమర్శ ప్రధానంగా వినపడుతోంది. సీనియర్ బౌలర్లను పక్కనపెట్టి కొత్తవాళ్లను తీసుకురావాలని భావిస్తున్న గంభీర్.. ప్రతిభ ఉన్నవాళ్లను గుర్తించే విషయంలో ఫెయిల్ అవుతున్నాడు.

Also Read : సీన్ లోకి తమిళ హీరో..? అఖండకు లైన్ క్లియర్..?

ఇప్పుడు హర్షిత్ రానా పైన ఎక్కువ దృష్టి సారించిన గంభీర్.. మరో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ విషయంలో మాత్రం ఈ దూకుడు ప్రదర్శించడం లేదు. 150 కిలోమీటర్ల వేగంతో బంతి విసరగలిగే సామర్థ్యం ఉన్న మయాంక్ యాదవ్ ప్రస్తుతం గాయాలు కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ లో లక్నో జట్టుకు గంభీర్ మెంటర్ గా వ్యవహరించిన సమయంలో.. మయాంక్ యాదవ్ ఆ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత గాయాలు కారణంగా అతను సరిగా ఆడ లేక పోయాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు మయాంక్.

Also Read : అమరావతి: ‘కలల రాజధాని’ నుంచి ‘క్రియేటివ్ క్యాపిటల్’ వైపు

అయితే అతనికి అవకాశాలు ఇచ్చే విషయంలో మాత్రం గంభీర్ ముందుకు రావడం లేదు. మూడు ఫార్మాట్లలో రొటేషన్ పద్ధతి పాటిస్తూ వస్తున్న గంభీర్.. హర్షిత్ రానా విషయంలో మాత్రం అన్ని ఫార్మాట్లు ఆడిస్తున్నాడు. కనీసం టీ20 లో అతన్ని పక్కనపెట్టి మయాంక్ యాదవ్ ను ముందుకు తీసుకురావాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. ప్రస్తుతం 23 ఏళ్ల వయసున్న మయాంక్.. సరిగ్గా రాణిస్తే సేనా దేశాల్లో భారత జట్టు పర్యటించినప్పుడు బౌలింగ్ కు వెన్నుముకగా మారే అవకాశాలుంటాయి. కేవలం హర్షిత్ వైపే చూస్తున్న గంభీర్.. అతను రాణించకపోయినా సరే అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనితో మాజీ క్రికెటర్ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పవన్ ను ఎందుకు...

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం...

ఏపీ బడ్జెట్ విశేషాలు.....

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక...

అధినేతపై గుర్రుగా క్యాడర్.....

పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అసలు ఆయన...

లోకేష్ కు జనసైనికులు...

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం...

అంబటి దెబ్బ.. ఆ...

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ...

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

పోల్స్