Wednesday, February 4, 2026 04:20 PM
Wednesday, February 4, 2026 04:20 PM

అమరావతి: ‘కలల రాజధాని’ నుంచి ‘క్రియేటివ్ క్యాపిటల్’ వైపు

దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబు నాయుడు కల. ఈ కలను వాస్తవం చేసేందుకు, నారా లోకేష్ అమెరికాలో ప్రాధాన్యమైన పరిశ్రమ నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, హాలీవుడ్ డైరెక్టర్ & స్క్రీన్‌రైటర్ చిక్ రసెల్‌తో జరిగిన భేటీలో ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని లోకేష్ కోరారు.

Also Read : సీన్ లోకి తమిళ హీరో..? అఖండకు లైన్ క్లియర్..?

ఈ ట్రాన్స్‌మీడియా సిటీ ప్రాజెక్ట్‌ ద్వారా అమరావతిని ప్రపంచ స్థాయి క్రియేటివ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక సిద్ధమైంది. ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, ఏఆర్/వీఆర్ థీమ్ పార్కులు, అత్యాధునిక కో-ప్రొడక్షన్ సౌకర్యాలు, గేమింగ్–యానిమేషన్–VFX రంగాలకు ప్రత్యేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి ఫీచర్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగం. అదనంగా, “క్రియేటర్ ల్యాండ్ అకాడమీ” ద్వారా స్థానిక యువతకు అత్యాధునిక టెక్నాలజీలపై కటింగ్ ఎడ్జ్ ట్రైనింగ్ అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

ఈ మెగా ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ₹10,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాల సృష్టి ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భవిష్యత్తు వినోద, టెక్, గేమింగ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్రియేటివ్-టెక్ రంగాల్లో స్థానిక యువతకు అద్భుత అవకాశాలు ఏర్పడనున్నాయి.

Also Read : కేంద్రం సంచలనం.. వన్ నేషన్ వన్ స్టూడెంట్..!

గత ఏడాది మే 4న ప్రభుత్వం–క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఒప్పందం కుదిరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం 24 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ దిశగా ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమైతే, అమరావతి పరిపాలనా రాజధానిని దాటి, దేశంలోని తొలి ‘క్రియేటివ్ క్యాపిటల్’గా ఎదిగి కొత్త ట్రెండ్‌ను సెట్ చేయనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్