Wednesday, February 4, 2026 02:30 PM
Wednesday, February 4, 2026 02:30 PM

ఉవ్వెత్తున ఎగిసిన కెరటం.. జానీ ఈజ్ బ్యాక్..!

చేయని తప్పుకు నిందలు, ఆరోపణలు.. ఎన్నో.. ఎన్నెన్నో .. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఓ కెరటాన్ని ఆపడానికి చేసిన కుట్రలెన్నో. అన్నింటికీ తట్టుకుని నిలబడి సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తే ఆ కిక్కే వేరు. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో జరిగింది ఇదే. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన ఓ అమ్మాయి.. తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్లు, కూర్చున్న చెట్టునే నరికేసుకున్నట్లు ఆయనపైనే లేనిపోని ఆరోపణలను మోపింది. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను ఆమె.. ఓ మంచి మనిషిని ముప్పతిప్పలు పెట్టడానికి అస్త్రాలుగా వాడుకుంది. తాను ఏం చెబితే అది జనం నమ్మేస్తారులే అనుకుని తనకు కావాల్సినట్టు కథలు అల్లింది.

Also Read : తెలుగు నటి అరుదైన రికార్డు.. ప్రగతి విజయగాథ!

అయితే మన నిజాయితీయే ఎప్పటికైనా మనల్ని రక్షిస్తుందని నమ్ముకున్న జానీ మాస్టర్ తన పని తాను చేసుకుంటూ తనేంటో నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తనను కిందకు లాగాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. వాటిని తలదన్నుకుంటూ పనే దైవంగా, కళామతల్లే తనకు రక్షగా భావిస్తూ నచ్చిన పనిని అందరూ మెచ్చేలా చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకు ప్రతిఫలమే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ గ్లోబల్ రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అవడం. ఒకవైపు కొరియోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు తన అసోసియేషన్ కోసం తను ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా జరిగిన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్.. టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్ష ఎన్నికల్లో తన సతీమణి సుమలతను ప్రెసిడెంట్‌గా గెలిపించుకున్నారు.

Also Read : సీన్ లోకి తమిళ హీరో..? అఖండకు లైన్ క్లియర్..?

దటీజ్ జానీ మాస్టర్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లు జానీ మాస్టర్ చేసిన ప్రయత్నం ఫలించింది. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే అసోసియేషన్‌లో అందరి మద్దతు మళ్లీ లభించిందనే మాట ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. రీసెంట్‌గా జరిగిన టీఎఫ్‌టీడీడీఏ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. అందులో సుమలత జానీ మాస్టర్‌కు 228 ఓట్లు, జోసెఫ్ ప్రకాష్‌కు 199, చంద్రశేఖర్‌కు 11 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 29 ఓట్ల మెజారిటీతో సుమలత విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో తను నిలబడితే మళ్లీ కుట్రలు పన్ని అడ్డంకులు కలుగజేస్తారనే అనుమానంతో జానీ మాస్టర్ తన అర్ధాంగిని ప్రెసిడెంట్ రేసులో ఉంచారు.

Also Read : క్రోం వాడద్దు.. ఆపిల్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇక్కడ జానీ మాస్టర్ తన సతీమణిని ప్రెసిడెంట్‌గా నిలబెట్టి ఆమెకు సముచిత గౌరవాన్ని అందించారు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో సుమలత కూడా ఎంతో క్షోభకు గురయ్యారు. భర్తపై అలాంటి ఆరోపణలు వస్తే ఇంకొకరు అయితే బయటకు కూడా రారు. కానీ సుమలత తన భర్తకు ఎంతగానో అండగా నిలిచారు. మానసికంగా ఎంతో ధైర్యాన్నిచ్చారు. అందుకే జానీ మాస్టర్ ఆ గాయం నుంచి త్వరగా కోలుకుని ‘చికిరి చికిరి’ లాంటి అద్భుతమైన పాటను ఇవ్వగలిగారు. మొత్తంగా మనం మంచి చేస్తే అదే మనల్ని రక్షిస్తుందనే నమ్మకాన్ని జానీ మాస్టర్ తన విషయంలో నిరూపించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్