Wednesday, February 4, 2026 06:04 PM
Wednesday, February 4, 2026 06:04 PM

ఈరోజు (09-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 09-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 09-12-2025

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నూతన గృహాపకరణాలు కొనుగోలుచేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాల అందుతాయి.

—————————————

వృషభం 09-12-2025

సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

—————————————

మిధునం 09-12-2025

నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగామిస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

కర్కాటకం 09-12-2025

కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

—————————————

సింహం 09-12-2025

ఉద్యోగాలలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

—————————————

కన్య 09-12-2025

అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. భూ సంభందిత క్రయ విక్రయాల అంతంత మాత్రంగా సాగుతాయి.

—————————————

తుల 09-12-2025

వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అదిగమించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

—————————————

వృశ్చికం 09-12-2025

ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమునకు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

ధనస్సు 09-12-2025

సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

—————————————

మకరం 09-12-2025

వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

—————————————

కుంభం 09-12-2025

జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.

—————————————

మీనం 09-12-2025

జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్