Sunday, March 22, 2026 07:44 AM
Sunday, March 22, 2026 07:44 AM

ఈరోజు (07-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 07-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 07-12-2025

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

—————————————

వృషభం 07-12-2025

సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.

—————————————

మిధునం 07-12-2025

నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

—————————————

కర్కాటకం 07-12-2025

సంతాన విద్యా ఉద్యోగం విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

—————————————

సింహం 07-12-2025

ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

కన్య 07-12-2025

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

—————————————

తుల 07-12-2025

ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

వృశ్చికం 07-12-2025

ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

—————————————

ధనస్సు 07-12-2025

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

—————————————

మకరం 07-12-2025

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

—————————————

కుంభం 07-12-2025

బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

—————————————

మీనం 07-12-2025

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్