Wednesday, February 4, 2026 02:47 PM
Wednesday, February 4, 2026 02:47 PM

మహిళా నేతల దూకుడు.. కూటమి కొంప ముంచుతుందా..?

సాధారణంగా గతంలో రాజకీయాల్లో మహిళలు కాస్త సైలెంట్ గా ఉండే పరిస్థితి ఉండేది. ఎక్కడో ఒకరిద్దరు నేతలు మినహా పెద్దగా దూకుడు కూడా ప్రదర్శించేవారు కాదు. కానీ గత పదేళ్ల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో మహిళా రాజకీయ నాయకుల వివాదాలు ఎక్కువయ్యాయి. కొందరు మాటలతో వివాదాల్లో ఉంటే మరికొందరు చేతలతో వివాదాల్లో ఉంటున్నారు. వైసీపీలో ఉండే కొందరు మహిళా నేతలు.. కాస్త దూకుడుగా ఉండేవారు. ఇక ఇప్పుడు కూటమిలో కూడా దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టీడీపీలో కొందరు మహిళ నేతల హడావుడి పెరిగినట్లు విమర్శలు వస్తున్నాయి.

Also Read :సీదిరి ఒంటరి పోరాటం.. వైసీపీ నేతల సహాయ నిరాకరణ..!

మీడియాతో మాట్లాడే విషయంలో వివాదాల్లో ఉండటం ఒకటైతే.. గెలిచిన మహిళా ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. కుటుంబ సభ్యులకు పెత్తనం ఇవ్వడంతో వాళ్లు చెలరేగిపోతున్నారు. ఉత్తరాంధ్రలో ఓ మహిళ నేత ఇటీవల వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ఎక్కువగా ఆధిపత్యం చెలాయించడంతో టిడిపి కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఇటీవల ఆమె వైఖరితో ప్రభుత్వం కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఆమె వ్యవహారాలపై వైసీపీ అధిష్టానం కూడా ఒక కన్నేసి ఉంచినట్లు సమాచారం.

Also Read : విజయనగరానికి దూరంగా బొత్సా కుటుంబం..? విశాఖపై ఫోకస్..?

ఇటీవల పార్టీ అధిష్టానం నుంచి హెచ్చరికలు వెళ్లిన సరే ఆమె వైఖరిలో మార్పు రావడంలేదని విమర్శలు సైతం వస్తున్నాయి. తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా ఆమెకు హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా ఓ మహిళా ప్రజా ప్రతినిధి వ్యవహారం ముందు నుంచి వివాదాస్పదమవుతుంది. అటు రాయలసీమ జిల్లాల్లోని కొందరు మహిళ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి. సివిల్ తగాదాల్లో కూడా మహిళా ప్రజాప్రతినిధులు ఉంటున్నారనే విమర్శలు సైతం వినపడుతున్నాయి. ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం వీటి గురించి హెచ్చరిస్తున్నా సరే వారి వైఖరి మారడం లేదనేది టిడిపి వర్గాల్లో వినపడుతున్న మాట. వారు నష్టపోవడమే కాకుండా పార్టీకి కూడా తీరని నష్టం చేస్తున్నారని అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్