థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే భయపడే పరిస్థితి. మధ్య తరగతి వారు కూడా ఇప్పుడు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లాలంటే.. కాస్త ఆలోచిస్తున్నారు. ఇద్దరు కలిసి సినిమాకు వెళితే.. జేబులో రెండు వేలు ఖర్చు అయిపోతున్నాయి. దీంతో సగటు ప్రేక్షకుడు సినిమా చూసేందుకు థియేటర్ వైపు అస్సలు రావటం లేదు. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సినిమా అంటేనే భయపడిపోతున్నారు. థియేటర్లో చూడాలంటే.. వెనకడుగు వేస్తుున్నారు. ముఖ్యంగా టికెట్ ధరల కంటే కూడా క్యాంటిన్‌లో దొరికే స్నాక్స్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. కొత్త సినిమా టికెట్ 300 రూపాయలు ఉంటే.. స్నాక్స్ తిందామని బయటకు వస్తే మాత్రం.. 500 రూపాయలు అయిపోతున్నాయి. దీంతో సినిమాను థియేటర్‌లో ఎంజాయ్ చేయడం కంటే కూడా.. మొబైల్‌లో, ఓటీటీలో చూసి సరిపెట్టుకుంటున్నారు.
Also Read : ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర..!
ఏ సినిమా అయినా సరే టికెట్ ధర 200 రూపాయలు దాటకూడదని ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర భాషా సినిమాలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే.. ఆ సినిమా బడ్జెట్, క్రేజ్ దృష్టిలో పెట్టుకుని.. టికెట్ ధరలు పెంచేలా ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీని వల్ల వారం, పది రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి వచ్చేస్తుందనేది నిర్మాతల భావన. అయితే ఈ ధరలు సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బెనిఫిట్ షో పేరుతో ముందు రోజు రాత్రి షో వేస్తే.. దానికి ఏకంగా వేలల్లో టికెట్ ధర వసూలు చేస్తున్నారు. ఇక నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమాకు వస్తే.. టికెట్ ధరతో పాటు స్నాక్స్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనిపై పదే పదే ఫిర్యాదులు రావడంతో.. టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం నియంత్రణ విధించింది.
Also Read : అంతా నా ఇష్టం.. మారని కొలికపూడి వైఖరి
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం నిర్ణయం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో విక్రయించే తినుబండారాల ధరలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాఫీకి 700 రూపాయలు వసూలు చేస్తారా అని ప్రశ్నించింది. సినిమా చూడటానికి వస్తే.. 1500 రూపాయలు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టికెట్, ఫుడ్ ఐటమ్స్ ధరలు అందుబాటులో లేకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయని హెచ్చరించింది. టికెట్ ధర 200 ఉండాలనే కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. ధరలు అందుబాటులో లేకపోతే.. థియేటర్లకు జనం రారని.. అప్పుడు ఖాళీ థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తారా.. అని ప్రశ్నించారు.

