Thursday, October 23, 2025 06:09 PM
Thursday, October 23, 2025 06:09 PM
roots

దానం చుట్టూ మరో వివాదం..!

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. కాంగ్రెస్ పార్టీకి కరుడు గట్టిన అభిమాని. 1994లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. వరుసగా మూడు సార్లు ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో దానం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగింది. ఆసిఫ్ నగర్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో.. సరిగ్గా నామినేషన్ ముందు రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథంలో వెళ్లి.. టీడీపీ బీ ఫారం మీద నామినేషన్ దాఖలు చేసిన దానం నాగేందర్ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది కూడా. ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన దానం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. సైలెంట్‌గా వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేశారు. దీంతో దానం పార్టీ మార్పు ఖాయమని తేలిపోయింది. దీనిపై ప్రశ్నించిన వారికి.. నాకు వైఎస్ అంటే ఇష్టం.. అందుకే వచ్చా.. అని చెప్పారు. ఆ తర్వాత 2009లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు.

Also Read : జోగి రమేష్ సంగతేంటి..? ఇంకెందుకు ఆలస్యం..?

2014లో కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిన దానం.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం.. 2023లో కూడా విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. సైలెంట్‌గా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇక్కడే అసలు వ్యవహారం తెరపైకి వచ్చింది. పార్టీ ఫిరాయింపు చట్టం కింద పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఇప్పుడు విచారణ జరుగుతోంది. అయితే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు.. తామంతా కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటున్నారు. ఈ జాబితాలో దానం నాగేందర్ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ అనర్హత పిటీషన్ల పైన నిర్ణయం ఈ నెల 31వ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Also Read : పర్యటన తెచ్చిన తంటాలు..!

ఇదే సమయంలో జూబ్లీహిల్స్ లో పార్టీ ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పేరు చేర్చారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు అస్త్రంగా మారింది. నిజానికి విచారణ సమయంలో తాను పార్టీ మారలేదన్నారు దానం. కానీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే.. అది దానంపై అనర్హత వేటుకు కారణం అవుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఎలా చేరుస్తారని నిలదీస్తున్నారు. అంటే దానం పార్టీ మారినట్లే కదా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని.. దానం పై అనర్హత వేటు తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కూడా హస్తం పార్టీ ఓడిపోతుందంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

పోల్స్