సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు బయటకు రావడానికి కాస్త భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, హై సెక్యూరిటీ ఉన్న వాళ్లకు కాస్త కంగారే. గతంలో మాజీ సిఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. ముఖ్యంగా జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే.. ఎక్కువగా భద్రత ఉండేది. షాపులు మూసి వేయించి, భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసేవారు. జగన్ గన్నవరంలో బయల్దేరితే తాడేపల్లి వరకు ఓ రకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పరిస్థితి.
Also Read : భారతీయ విద్యార్ధులకు ట్రంప్ గుడ్ న్యూస్..!
ఆయన సతీమణికి కూడా అలాగే భద్రత కల్పించేవారు. పరదాలు లేకుండా జగన్ బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం సిఎం చంద్రబాబు మాత్రం.. పరదాలు లేకుండా, భద్రత విషయంలో భయం లేకుండా అడుగులు వేస్తున్నారు. అలిపిరి ఘటన తర్వాత సిఎంకు జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. దానికి తోడు సిఎం కాబట్టి మరింత భద్రత ఉంటుంది. అయినా సరే చంద్రబాబు మాత్రం ఇటీవల విజయవాడలోని బీసెంట్ రోడ్ లో చాలా స్వేచ్చగా తిరగడం ఆశ్చర్యపరిచింది. కమాండో లను కూడా ఆయన కాస్త దూరంగానే ఉంచారు.
Also Read : పాకిస్తాన్ కు కెలకడం అలావాటు.. మనకు గెలవడం అలవాటు..!
బీసెంట్ రోడ్ లో షాపులకు కూడా వెళ్లి ముచ్చటించారు. అక్కడ ఉన్న కస్టమర్ లను కూడా పెద్దగా ఖాళీ చేయించలేదు. వారితో స్వేచ్చగా కలిసిపోయారు సిఎం. భద్రత పరంగా జాగ్రత్తలు తీసుకున్నా సరే.. చంద్రబాబు అక్కడ ఉన్న ప్రజలతో చాలా స్వేచ్చగా మమేకం కావడం విశేషం. ఇక ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెద్దగా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. బందరు రోడ్ పై కాస్త ఇబ్బంది పడినా.. ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ జనసేన కార్యకర్తలు కూడా వీడియోలను షేర్ చేయడం గమనార్హం.