సినిమా పరిశ్రమ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాట్ టాపిక్ అయింది. కూటమి ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ మధ్య కాస్త మాటల యుద్ధం జరిగింది. సినిమా పరిశ్రమ పెద్దలను గత ముఖ్యమంత్రి అవమానించారని కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో కామెంట్ చేశారు. ఇది జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనమని కామినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలలో ఉన్న కొన్ని విషయాలను తప్పుపట్టారు.
Also Read : ఆ ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైందా..?
ఈ సందర్భంగా జగన్ సైకో అంటూ బాలకృష్ణ కామెంట్ చేశారు. ఇక అక్కడి నుంచి పరిస్థితి ఒకసారి గా మారింది. సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ వర్సెస్ టిడిపిగా వాతావరణం మారిపోయింది. అటు జనసేన కార్యకర్తలు కూడా ఈ విషయంలో టిడిపిని తప్పుపడుతున్నారు. గురువారం సాయంత్రం చిరంజీవి రాసిన లేఖ పై టిడిపి కార్యకర్తలు విరుచుకుపడ్డారు. మిమ్మల్ని జగన్ అవమానించిన సరే మీరు అవమానించలేదని ప్రకటించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో నందమూరి బాలకృష్ణను మీరు పట్టించుకోలేదని.. అయినా సరే బాలకృష్ణ మాత్రం తన సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో వెళ్లి ప్రభుత్వాన్ని అడగలేదని గుర్తు చేశారు.
మంచు విష్ణు, వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకున్నప్పుడు.. ఆయన కారు లోపల వరకు వెళ్ళగా.. అప్పట్లో చిరంజీవి ఇతర సినిమా ప్రముఖులు ప్రయాణించే కారు గేటు వద్దనే ఆపేసి నడిపించారు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మెగా అభిమానులు అలాగే ఇతర హీరోల అభిమానులు జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ తల్లి మాదిరిగా ఆలోచించి టికెట్ ధరలను పెంచాలని చిరంజీవి కోరిన వీడియో కూడా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిని ప్రస్తావిస్తూ టిడిపి కార్యకర్తలు చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు.
Also Read : లోకేష్ సాయం.. పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు..!
జగన్ను మీరు టికెట్ ధరలు పెంచాలని అడిగిన విధానం అందరికీ గుర్తుందని.. అప్పట్లో బాలకృష్ణ టికెట్ ధరల గురించి జగన్మోహన్ రెడ్డిని కలవలేని చెప్పారని గుర్తు చేస్తున్నారు. అవమానం జరిగినా.. అవమానం జరగలేదంటూ మీరు మాట్లాడటం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు టిడిపి కార్యకర్తలు. ఇక దీనికి జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే మెగా అభిమానులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ.. చిరంజీవి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడారంటూ జనసేన కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.