సంచలన నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇటీవల హెచ్ 1 బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నాయి. చైనా కే వీసాను ప్రవేశ పెట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రష్యా కూడా త్వరలో ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read :చైనా గుడ్ న్యూస్.. కొత్త వీసా ప్రవేశపెట్టిన బీజింగ్
ఇదిలా ఉంచితే.. తాను తీసుకున్న నిర్ణయం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో డోనాల్డ్ ట్రంప్ సర్కార్.. స్వల్ప మార్పులు చేస్తోంది. హెచ్-1బీ వీసా ఫీజు నిబంధనల్లో బిగ్ కంపెనీలకు ట్రంప్ రిలీఫ్ ఇచ్చారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఫైజర్ లకు ఊరట.. జాన్సన్ ఈ జాన్సన్, వాల్ మార్ట్ కంపెనీలకు మినహాయింపు ఇచ్చారు. నేషనల్ ఇంట్రస్ట్ వేవర్ కింద లక్ష డాలర్ల ఫీజు నిబంధన నుంచి తొలగించారు. దీనితో భారత్ నుంచి ఈ కంపెనీల్లో జాబ్ కి వెళ్లేవాళ్లకు రిలీఫ్ దక్కనుంది.
Also Read :డీజిల్, పెట్రోల్ ను జీఎస్టీలో అందుకే చేర్చడం లేదా..?
అదే విధంగా డాక్టర్ లకు సైతం గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్1బీ వీసాకు రూ.లక్ష డాలర్ల ఫీజు నుంచి డాక్టర్లకు మినహాయింపు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇవ్వనుంది. అమెరికా మారుమూల ప్రాంతాలకు విదేశీ వైద్యులే ఆధారం కావడంతో ఈ నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుపుతోంది. వైద్యుల నియామకానికి హెచ్ 1బీ వీసాలపై ఆధారపడిన ఆరోగ్య వ్యవస్థలు మయో క్లినిక్, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ లకు, ఇది ఒకరకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హెచ్ 1బీ వీసాలపైనే సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ ఆధారపడింది. వైద్య సిబ్బంది కొరత తీవ్రమవుతుందని యూఎస్ ఆరోగ్య సంస్థల హెచ్చరికల నేపధ్యంలో సర్కార్ మినహాయింపు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.