Wednesday, February 4, 2026 06:36 PM
Wednesday, February 4, 2026 06:36 PM

డీజిల్, పెట్రోల్ ను జీఎస్టీలో అందుకే చేర్చడం లేదా..?

దేశ వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. దీనితో కొన్ని ధరలు తగ్గగా, మరికొన్ని ధరలు పెరిగాయి. ఈ నేపధ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అసలు వాటిని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకు రావడం లేదనే ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. మన దేశంలో పెట్రోల్, డీజిల్ పై భారీగా పన్ను విధిస్తూ ఉంటారు. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గణనీయమైన భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.

Also read : లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలనం..!

వాటి ఉమ్మడి(కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల) పన్నులు 100 శాతం మించిపోవడంతో, రెండు ప్రభుత్వాలు పన్నులను తగ్గించడానికి వెనుకాడుతున్నాయి. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తాము ఉద్దేశపూర్వకంగా జీఎస్టీ పరిధిలో పెట్రోల్, డీజిల్‌ ను చేర్చలేదని, చేర్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. కానీ ఈ నిర్ణయం రాష్ట్రాల నుండి రావాలన్నారు. ప్రస్తుతం, పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు వ్యాట్ ద్వారా పన్ను విధిస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు ఈ ఆదాయంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

Also read : మర్రి రాకతో గుబులు మొదలైందా..?

ముఖ్యంగా రాష్ట్రాలు పన్నులు విధించే సామర్థ్యాన్ని పరిమితం చేయడం, కేంద్రంపై ఆధారపడటాన్ని పెంచే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. ఇంధనాలను జీఎస్టీలో చేరిస్తే.. రాష్ట్రాలు తమ సొంత పన్ను విధానం, ధర నిర్ణయించడం, వినియోగ విధానాలను ప్రభావితం చేయడంపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు తమ పన్ను ఆదాయంలో 25-30% కంటే ఎక్కువ ఇంధనాలపై ఆధారపడతాయి. అందుకే జీఎస్టీలో ఇంధనాలు చేర్చే విషయంలో రాష్ట్రాలు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్