గత కొన్నాళ్ళుగా ఓటు చోరీ అంశంలో కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ వస్తోన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి బాంబు పేల్చారు. కాంగ్రెస్ ఓటర్లు ఉన్న బూత్ లలో ఓటర్ల తొలగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో, 6,018 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని రాహుల్ విమర్శించారు. గోడబాయి అనే మహిళ కేసును ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. ఆమె పేరుతో నకిలీ లాగిన్ లను క్రియేట్ చేసి 12 మంది ఓటర్లను తొలగించారని విమర్శించారు రాహుల్.
Also Read : దీపికకు దండం పెట్టిన వైజయంతీ మూవీస్..!
కర్ణాటక బయటి నుంచి నకిలీ లాగిన్ లు ఉపయోగించి, మొబైల్ నంబర్ లను తొలగించారు అని రాహుల్ పలు ఆధారాలను మీడియా సమావేశంలో చూపించారు. 14 నిమిషాల్లో 12 మంది ఓటర్లను తొలగించినట్లు ఆయన ఆరోపించారు. సూర్యకాంత్ అనే వ్యక్తి లాగిన్స్ ఉపయోగించి ఈ ఓట్లను తొలగించారని రాహుల్ మండిపడ్డారు. ఇక మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నకిలీ ఓట్లను చేర్చారని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నాగరాజ్ అనే వ్యక్తి ఉదయం 4:07 గంటలకు కేవలం 38 సెకన్లలో రెండు ఓటు విత్ డ్రా ఫారమ్ లను నింపాడు అని, ఇది మానవులకు అసాధ్యం అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
Also Read : జూబ్లిహిల్స్ పై కవిత గురి..? పక్కా వ్యూహంతో బరిలోకి..!
ఓటర్ల తొలగింపు వెనుక కేంద్రీకృత సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆపరేషన్ ఉందని, బహుశా కాల్ సెంటర్ కావొచ్చని అన్నారు. పలు రాష్ట్రాల్లో దరఖాస్తులు దాఖలు చేయడానికి ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించారని ఆరోపణలు చేసారు. ఓటర్ల తొలగింపు, చేర్పులు రెండింటినీ మార్చటానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు రాహుల్ విమర్శించారు. ఈ కుంభకోణం వెనుక ఉన్నవారిని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షించారని రాహుల్ గాంధీ డైరెక్ట్ గా విమర్శించారు. ఓటర్ల తొలగింపు కుంభకోణానికి సంబంధించిన సమాచారం కోరుతూ కర్ణాటక సిఐడి 18 నెలల్లో 18 లేఖలు రాశారని, కానీ ఎన్నికల సంఘం ఎప్పుడూ అర్థవంతంగా స్పందించలేదని విమర్శించారు.