Wednesday, October 22, 2025 02:17 AM
Wednesday, October 22, 2025 02:17 AM
roots

జూబ్లిహిల్స్ పై కవిత గురి..? పక్కా వ్యూహంతో బరిలోకి..!

తెలంగాణాలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తిని రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దాదాపుగా బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో కీలక పార్టీల అభ్యర్ధులు ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, మరో ప్రతిపక్షం బిజెపి అభ్యర్ధులు ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు.

Also Read : టీటీడీ కీలక నిర్ణయం.. అన్ని సేవలకు లక్కీ డిప్‌..!

కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ చేస్తారని అందరూ భావించారు. కాని అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు సిఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాతి నుంచి నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినపడింది. ఇక బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి పోటీ చేసే అవకాశం ఉంది. ఇటు బిజెపి నుంచి కాకుండా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా ఓ వార్త హాట్ టాపిక్ అయింది. తీన్మార్ మల్లన్న తెలంగాణాలో పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించారు.

Also Read : బీహార్ లో ఒంటరి యుద్ధం.. రాహుల్ సంచలన నిర్ణయం..!

ఈ పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో, కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణా జాగృతి నుంచి అభ్యర్ధిని నిలబెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో నష్టపోయే అవకాశం ఉండవచ్చు. కవితకు బీఆర్ఎస్ లో కొంత మద్దతు ఉంది. వ్యక్తిగతంగా కూడా ఆమెకు ఉన్న ఇమేజ్ తెలంగాణాలో బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కోర్ట్ తీర్పుతో ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన అలీ ఖాన్ ను కవిత నిలబెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనితో కాంగ్రెస్ ఇక్కడ నష్టపోయే విధంగా కవిత అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా కొంత నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే అధికార పార్టీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్