బీహార్ ఎన్నికల్లో రాజకీయం ఆసక్తిని రేపుతోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో.. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్.. ఆర్జెడితో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసింది. 19 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ.. మిగిలిన స్థానాల్లో గెలుపుపై ముందే ఆశలు వదిలేసుకుంది. ఇక ఆర్జెడి 75 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆర్జెడి డిమాండ్ కు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగింది.
Also Read : టీటీడీ కీలక నిర్ణయం.. అన్ని సేవలకు లక్కీ డిప్..!
గతంలో కంటే తక్కువ సీట్లు ఇస్తామని, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కాంగ్రెస్ కు కష్టమే అంటూ ఆర్జెడి క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో 243 స్థానాల్లో తామే పోటీ చేస్తామని కూడా ఓ నినాదం తీసుకొచ్చారు తేజస్వి యాదవ్. దీనికి తోడు ఇతర పక్షాలు కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నాయి. దీనితో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక అడుగు వేసే సంకేతాలు కనపడుతున్నాయి. ఈ నెల 24 న బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది.
Also Read : ఓజీ.. రెడీ ఫర్ స్క్రీనింగ్..!
2023 తెలంగాణా ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్ లో ఇలాగే సమావేశం అయింది. పాట్నా సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలు, శాసన సభా పక్ష నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ఆహ్వానించింది. దీనితో ఈ సమావేశంలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే వామపక్షాలతో పొత్తు పెట్టుకునే అంశంపై కూడా కాంగ్రెస్ నిర్ణయం తీసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. గత ఎన్నికల్లో వామపక్షాలకు 19 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.