ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సమావేశంలో పరిశుభ్రత, పచ్చదనం, చేతివృత్తుల విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేసారు. జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చారు సిఎం. ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా రాష్ట్రమంతా వర్తింపచేయాలని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా గతంలో హైదరాబాద్ లో అమలు చేసిన పలు విధానాలను కలెక్టర్ లకు సిఎం వివరించారు.
Also Read : భారత్ కు ట్రంప్.. అమెరికా రాయబారి కీలక ప్రకటన
హైదరాబాద్‌లో నైట్ క్లీనింగ్ ప్రారంభించామని గుర్తు చేసారు. పొరుగుసేవల సిబ్బందిని నియమించడం కూడా అదే తొలిసారని తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను ఉద్యమంగా చేస్తున్నామన్నారు చంద్రబాబు. మొదటిసారి సింగపూర్ వెళ్లి అక్కడ పరిస్థితిని అధ్యయనం చేశా.. ప్రధాని నాకు అవకాశమిస్తే స్వచ్ఛభారత్ రిపోర్టు కూడా ఇచ్చామని తెలిపారు. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లో చూడాలి.. ఒకప్పుడు ఆనంద ఆదివారం కూడా పెట్టామన్నారు. ఎవరికి ఏ ప్రతిభ ఉంటే దాన్ని బయటపెట్టేవాళ్లని పేర్కొన్నారు.
Also Read : వరల్డ్ వైడ్ గా మిరాయ్ డామినేషన్.. సెంచరీ మార్క్ పక్కా..!
ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కొన్ని కార్యక్రమాలు వచ్చాయన్నారు. లాఫింగ్ సొసైటీ, షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మన సంస్కృతి.. వృక్షాలు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం కార్యక్రమం రూపొందించాలని, వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురు సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సీఎం సూచనలు చేసారు. కాల్వల కోసం మళ్లీ తవ్వకుండా పైపులైన్లు పెట్టేలా ఎస్‌ఓపీ చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రూరల్ ఏరియాలో అర్బన్ సౌకర్యాలతో ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్వచ్ఛత అంటే శుభ్రత ఒక్కటే కాదు, ప్రజల ఆలోచన కూడా మారాలని స్పష్టం చేసారు.