Monday, September 15, 2025 10:14 PM
Monday, September 15, 2025 10:14 PM
roots

భారత్ కు ట్రంప్.. అమెరికా రాయబారి కీలక ప్రకటన

నిత్యం వివాదాస్పద వైఖరితో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. భారత్ అమెరికాకు ముందు నుంచి నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నా సరే ట్రంప్ మాత్రం సుంకాలతో భారత్ ను ఇబ్బంది పెట్టారు. ఇక ప్రపంచ దేశాలకు సైతం భారత్ పై భారీగా సుంకాలు విధించాలి అంటూ సూచనలు చేయడం మొదలుపెట్టారు. రెండు దఫాలుగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించడంతో.. భారత్ కూడా ప్రత్యామ్న్యాయాలు వెతకడం మొదలుపెట్టింది.

Also Read : వరల్డ్ వైడ్ గా మిరాయ్ డామినేషన్.. సెంచరీ మార్క్ పక్కా..!

ఇదిలా ఉంచితే ఇప్పుడు భారత్ తో మళ్ళీ స్నేహాన్ని పెంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. నవంబర్ లో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని భారత్ లో అమెరికా రాయబారిగా నామినీగా ఉన్న సెర్గియో గోర్ వెల్లడించారు. వైట్ హౌస్ ఈ పర్యటనపై వర్క్ చేస్తోందని ఆయన కామెంట్ చేసారు. ట్రంప్ గనుక భారత్ వస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ కు ఊతం లభిస్తుందని, ఫార్మా, రక్షణ రంగాలకు ఇది ఖచ్చితంగా లాభదాయకం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : AI కంటెంట్ క్రియేటర్స్‌కి లైసెన్స్ తప్పనిసరి

ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికాకు భారత్ దూరం అయ్యే సంకేతాలు ఉండటంతో రష్యా జాగ్రత్త పడుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింతగా పెంచాలని భావిస్తోంది. ఇదిలా ఉంచితే.. విదేశీ ఉద్యోగుల విషయంలో ఇప్పటి వరకు మొండి వైఖరి ప్రదర్శించిన ట్రంప్.. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసారు. విదేశీ నిపుణులను నియమించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారి నుంచి నేర్చుకుని వారికంటే మెరుగ్గా రాణించాలి అని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఐటీ రిటర్న్ కు...

ఆదాయపు పన్ను దాఖలు విషయంలో సంబంధిత...

యూరియా వాడితే క్యాన్సర్.....

ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో...

సజ్జలను లైట్ తీసుకోండి.....

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ...

భోగాపురంలో ఫస్ట్ విమానం...

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి...

వైసీపీ నేతలకు ఆ...

ఏపీలో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి...

సజ్జల ప్రకటనతో వైసీపీలో...

వైసీపీ అధికారంలోకి వస్తే.. అమరావతి రాజధాని...

పోల్స్