Sunday, September 14, 2025 12:01 PM
Sunday, September 14, 2025 12:01 PM
roots

చంద్రబాబు అలా ఎందుకన్నారు..?

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏదైనా ఒక మాట చెప్పారంటే.. అందులో చాలా అర్థం ఉంటుంది. అయితే అది అర్థం చేసుకునే వారే.. తప్పుడు అర్థాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. గతంలో కూడా వ్యవసాయం దండగ అనే మాట అన్నారని తెగ రాద్ధాంతం చేశారు. వాస్తవానికి దండగ అంటే.. నష్టం అని చిత్తూరు జిల్లా వారికి చాలా స్పష్టంగా తెలుసు. వ్యవసాయంలో నష్టం వస్తుందనే మాటను సొంత మాండలీకంలో సొంత వారి మధ్య చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మొత్తం రాష్ట్రానికే అంటగట్టారు నాటి కాంగ్రెస్ పెద్దలు.

Also Read : టార్గెట్ పంచాయితీ.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు..!

ఇక రాజధాని అమరావతి విషయంలో కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు నానార్థాలు తీస్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణానికంటే ముందే కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి వాటిల్లో తాత్కాలికంగా ఆయా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తాత్కాలిక భవనం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బూచిగా చూపించి.. తాత్కాలిక భవనాలకు వందల కోట్లు ఖర్చు అంటూ ప్రచారం చేశారు. వాస్తవానికి భవనాలు తాత్కాలికం కాదు.. కార్యాలయాలు మాత్రమే తాత్కాలికం. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు.

తాజాగా ఓ మీడియా కాంక్లేవ్‌లో పాల్గొన్న చంద్రబాబు.. అమరావతి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమరావతి నగరానికి 33 వేల ఎకరాలు భూసమీకరణ చేశామని.. త్వరలోనే మరో విడత భూసమీకరణ ఉంటుందన్నారు. అలాగే 50 వేల ఎకరాల్లో నగరం నిర్మాణం సాధ్యం కాదన్నారు. 50 వేల ఎకరాల్లో ఉంటే.. అది మేజర్ మునిసిపాలిటీ అవుతుందని.. మహా నగరం కావాలంటే.. మరికొంత భూమి కూడా కావాలన్నారు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.

Also Read : మెగా ఫ్యాన్స్ కు 18 ఇయర్స్ గిఫ్ట్ రెడీ

అయితే చంద్రబాబు వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించేందుకే 33 వేల ఎకరాలు భూమి సేకరిస్తున్నామని గొప్పగా చెప్పారు.. మళ్లీ రెండో విడతలో 40 వేలు కావాలన్నారు. మళ్లీ ఇప్పుడు ఇంకా భూమి కావాలంటున్నారు.. అసలు భూమితో ఏం చేస్తున్నారు.. నగర నిర్మాణం పేరుతో భూ సంతర్పణ చేస్తున్నారా.. అని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వెనుక చాలా అర్థం ఉంది. ప్రస్తుతం మేజర్ మునిసిపాలిటీగా ఉన్న నూజివీడు విస్తీర్ణం 50 వేల ఎకరాలు మాత్రమే. దానిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇలా వ్యాఖ్యలు చేశారనేది మేధావుల మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్