Monday, October 27, 2025 07:57 PM
Monday, October 27, 2025 07:57 PM
roots

లోకేష్ అదుర్స్.. వార్ రూమ్ లోనే మంత్రులు

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిస్థితులను సమీక్షిస్తూ తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి మంత్రి నారా లోకేష్, ఇతర కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్న లోకేష్.. ఆర్టీజీఎస్ కార్యాలయంలో హోం మంత్రి అనిత తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read : రష్యా – ఉక్రెయిన్ యుద్దంలో భారతీయలు.. కేంద్రం కీలక ప్రకటన

అటు ప్రత్యేక విమానాల ఏర్పాటు, భారత సరిహద్దుల్లోకి తీసుకొచ్చే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ లను సైతం ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. నేడు మధ్యాహ్నం నేపాల్ నుంచి తెలుగు పౌరుల తరలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నేపాల్‌లోని పోఖరా నుంచి 10 మంది తెలుగు పౌరులు ప్రత్యేక విమానంలో ఖాట్మండు బయల్దేరడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. మధ్యాహ్నం 12:40 గంటలకు పోఖరా నుంచి విమానం బయల్దేరి, 1:15 గంటలకు ఖాట్మండూ చేరుకుంది.

Also Read : తమిళనాడు పై పవన్ గురి..?

అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరే ఇండిగో విమానంలో వారిని ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్.టి.జి.ఎస్. వార్ రూమ్ నుంచి మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక విమానం విశాఖ చేరుకోగానే వారికి స్వాగతం పలికేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి వెళ్లనున్నారు. నేపాల్‌ నుంచి తిరిగివచ్చిన వారిని స్వస్థలాలకు చేర్చేలా కూటమి ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్