Friday, September 12, 2025 05:14 PM
Friday, September 12, 2025 05:14 PM
roots

కూన ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్..!

ఏపీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. రవికుమార్ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ మహిళా ప్రిన్సిపాల్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వీడియో కాల్‌లో కూన అసభ్యంగా ప్రవర్తించారనేది ప్రిన్సిపాల్ ప్రధాన ఆరోపణ. అయితే ఇవి తప్పుడు ఆరోపణలని.. ఈ కధకు కొంతమంది తెర వెనుక ఉండి ఆడిస్తున్న డ్రామా అనేది కూన రవికుమార్ ఆరోపణ. ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కూన రవికుమార్.

Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూన రవికుమార్ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆరోపించారు. తన మాట వినలేదనే కారణంగానే తనను బలవంతంగా బదిలీ చేశారనేది సౌమ్య ఆరోపణ. సౌమ్య చేసిన వ్యాఖ్యలు సిక్కోలు జిల్లాలో పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యవహారం పార్టీ కేంద్ర కార్యాలయం వరకు చేరింది. దీంతో కూన తీరుపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికాలో ఉన్న కూన.. ఆఘమేఘాల మీద అమరావతి చేరుకున్నారు. ముందుగా చెప్పినట్లుగా నేరుగా మీడియా ముందుకు వచ్చారు. సౌమ్య తనపై చేసినవి నిరాధారమైనవని కొట్టి పారేశారు. బదిలీ చేస్తే వేధించినట్లు ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు కూన.

ప్రిన్సిపాల్ సౌమ్య తనపై చేసిన ఆరోపణలను కూన తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం తలదించుకునేలా సౌమ్య ఆరోపణలు ఉన్నాయన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు వచ్చానంటే.. అందుకే తన నియోజకవర్గ ప్రజల అండ కారణమన్నారు. ప్రభుత్వ విప్‌గా పని చేసిన తనపై వేధింపుల ఆరోపణలు దారుణమన్నారు. తాను శారీరకంగా, మానసికంగా వేధించినట్లు ఆధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు. తాను నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మరో ముగ్గురు ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారన్నారు కూన రవికుమార్.

Also Read :తెలుగు ఆల్ రౌండర్ కు దక్కని చోటు.. ఆసియా కప్ జట్టు ఇదే..!

విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడినట్లు తెలిపిన కూన రవికుమార్.. ఆమె మీద ఫిర్యాదులు వచ్చాయని.. అందుకే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు. బదిలీ చేస్తే వేధింపులు అవుతాయా అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రిన్సిపాల్ సౌమ్యతో పాటు వైసీపీ నేతలు కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన కుటుంబం జోలికి వస్తే తాట తీస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కూన రవికుమార్.

అయితే కూన ఎపిసోడ్‌లో సొంత పార్టీ నేతలే ఉన్నారనేది సిక్కోలు జిల్లా పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. ముక్కుసూటిగా మాట్లాడే కూన రవికుమార్‌ తమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత.. ఈ వ్యవహారం మొత్తం నడిపించినట్లు తెలుస్తోంది. జిల్లాలో తొలి నుంచి తమ మాట వినకుండా.. నేరుగా అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నారని.. అటు జిల్లా రివ్యూ సమావేశాల్లో కూడా తమకు అడ్డు పడుతున్నారనే కారణంతో.. కూనను టార్గెట్ చేశారనేది ప్రధాన ఆరోపణ.

Also Read :వాళ్ళను చంద్రబాబు వదలరు.. అసెంబ్లీలో కొత్త చట్టం

జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కూన రవికుమార్ ఇప్పటికే మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే ఆయనకు బదులుగా ఇచ్ఛాపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన బెందాళం అశోక్‌కు మంత్రిపదవి ఇప్పించాలనేది సీనియర్ నేత ఆలోచన. తమకు అత్యంత సన్నిహితంగా మెలిగే అశోక్‌ను మంత్రిని చేస్తే.. జిల్లా కూడా తమ కంట్రోల్‌లోనే ఉంటుందనేది ఆ సీనియర్ నేత ఆలోచన. అందుకే అశోక్ కోసం కూన రవికుమార్‌ను తప్పించే ప్రయత్నమే సౌమ్య వ్యవహారం అనేది జిల్లా టీడీపీ నేతల్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి కూన ఎపిసోడ్‌లో తెర వెనుక ఉన్న సీనియర్ నేత ఎవరనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్