ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారాలు భర్తలకు సమస్యగా మారుతున్నాయి. డబ్బున్న వారి దగ్గర నుంచి పేదవారి వరకు ఈ వ్యవహారంలో నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురై అవి విడాకుల వరకు వెళుతుంటే ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఎదురయ్యే సమస్యలు మగవారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. భర్తకు భారీ ఆదాయం ఉందంటూ భార్యలు భరణం భారీగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా భరణం డిమాండ్ చేసే మహిళలు తమ పోషణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు.
Also Read : ఇటలీలో రేసింగ్ ప్రమాదం.. మరోసారి సురక్షితంగా బయటపడ్డ హీరో అజిత్
కానీ ఇప్పుడు మహిళలు మాత్రం భరణం రూపంలో సంపాదన వెతుక్కుంటున్నారు. భరణం ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాలనే లక్ష్యం పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ మహిళ అడిగిన భరణం చూసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ గవాయి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విడాకులు పొందేందుకు ఓ మహిళ భరణం కింద 12 కోట్ల రూపాయలతో పాటుగా ముంబైలో ఒక ఇల్లు అలాగే బిఎండబ్ల్యూ కారు కూడా కోరింది. ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్.. ఉన్నత చదువులు చదివి అలాగే సొంతగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడం సరికాదని సదరు మహిళకు సూచించారు.
Also Read : దుబాయ్ ను చూస్తే అసూయ.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
దీనిపై స్పందించిన సదరు మహిళ తన భర్త ధనవంతుడని తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని కోర్టుకు తెలిపింది. అతనే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాడని కోర్టుకు వివరించింది. వైద్యం కోసం ఎక్కువ ఖర్చవుతుందని అంత భరణం అడుగుతున్నానని కోర్టుకు తెలుపగా.. దీనిపై స్పందించిన బీర్ గవాయి.. భరణం గా భర్త నుంచి ముంబైలో ఇల్లుతో పాటుగా నాలుగు కోట్ల నగదు ఇప్పిస్తామని అలాగే ఉద్యోగం చేసుకోవాలని సదరు మహిళలకు సూచించారు. ఈ ఆర్డర్ ను చీఫ్ జస్టిస్ రిజర్వ్ చేశారు.