Sunday, June 21, 2026 12:43 PM
Sunday, June 21, 2026 12:43 PM

వీసా లేకుండా భారతీయులు ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చంటే..?

భారతీయులకు పలు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయి. పర్యాటకులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కీలకం. పెద్ద ఎత్తున యూరప్, మలేషియా, రష్యా వంటి ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో భారతీయులకు కొన్ని దేశాలు గుడ్ న్యూస్ చెప్తున్నాయి. లేటెస్ట్ గా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం , వీసా రహిత జాబితాలో భారత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 85వ స్థానం నుండి 77వ స్థానానికి చేరుకుంది. 59 దేశాలకు భారతీయులు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు.

Also Read : ఒక్క కామెంట్‌తో ఇండియాను ఫిదా చేసిన లోకేష్

మలేషియా, ఇండోనేషియా, మాల్దీవులు, థాయిలాండ్‌ దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రయాణం కల్పిస్తున్నాయి. శ్రీలంక, మకావు, మయన్మార్ వంటి దేశాలు వీసా-ఆన్-అరైవల్ ను అందిస్తున్నాయి. సింగపూర్ 193 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తోంది. జపాన్, కొరియా 190 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తూ రెండవ స్థానంలో ఉన్నాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ మరియు స్పెయిన్ దేశాల ప్రజలు వీసా లేకుండా వెళ్ళవచ్చు. 189 గమ్యస్థానాలకు వారికి వీసా అవసరం లేదు.

Also Read : అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ కక్ష..!

ఆసియా దేశాల్లో భారత్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇటీవల రష్యా కూడా పర్యాటకులు వీసా లేకుండా తమ దేశానికి రావచ్చని ప్రకటించింది. ఈ విషయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు వెనుకబడ్డాయి. గ్లోబల్ మొబిలిటీ స్పెక్ట్రంలో, ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున ఉంది. ఆ దేశ పౌరులు వీసా లేకుండా 25 దేశాలకు మాత్రమే వెళ్ళగలరు. తాలిబాన్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంపై ప్రపంచ దేశాలు ఆంక్షలు కఠినతరం చేసాయి. అయితే ఆఫ్ఘన్ మాత్రం విదేశీయులను తమ దేశానికి ఆహ్వానిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్