Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

వివేకా కేసు.. సెన్సేషనల్ క్రియేట్ చేయబోతుందా..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక చర్యలకు రంగం సిద్దమవుతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా సుప్రీం కోర్ట్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల బెయిల్ రద్దు చేయాలని వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత, సీబీఐ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన పిటీషన్ ను విచారించింది సుప్రీం కోర్ట్. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల్లో కూడా తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

Also Read : అమ్మో పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రానికి ట్రంప్ దెబ్బ తప్పదా..??

ఈ సందర్భంగా డిల్లీ సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకానంద రెడ్డి కేసులో.. మూడు ముఖ్యమైన అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాతే ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణ కొనసాగిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణను సుప్రీం వాయిదా వేసింది. ఇక ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తున్నదా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది.

Also Read : స్టాక్ మార్కెట్ లో హెరిటేజ్ దూకుడు.. ఒక్కరోజులో భువనేశ్వరి లాభం ఎంతంటే..?

ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా సీబీఐ అభిప్రాయం ఏమిటో తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం సిబిఐకి సూచించింది. అలాగే కేసు ట్రయల్‌తో పాటు తదుపరి దర్యాప్తును ఒకేసారి కొనసాగించే అవకాశం ఉందా? అనే విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించింది. కాగా గతంలో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం లో బెయిల్ పిటీషన్ లు దాఖలు అయ్యాయి. దీనిని గమనిస్తోన్న రాజకీయ పరిశీలకులు ఈ కేసులో కీలక అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. లిక్కర్ కేసుతో పాటుగా ఈ కేసును కూడా ముందుకు నడిపించే అవకాశాలు కనపడుతున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డిని వచ్చే నెలలో అరెస్ట్ చేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్