భారత్ తో వాణిజ్య ఒప్పందాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ట్రంప్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత మార్కెట్లలోకి ప్రవేశించడానికి వీలు కల్పించే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని ఆయన మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో ఇండోనేషియాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఇండోనేషియాపై విధించిన సుంకాల్లో 19 శాతం తగ్గించారు ట్రంప్.
Also Read : కేరళ నర్సు కథ సుఖాంతమా..? ఉరిశిక్ష ఆగినట్టేనా..?
భారత్ లో అడుగు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు తాము విధించిన సుంకాల కారణంగానే భారత్.. తమ మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు అంగీకారం తెలుపుతోందని వెల్లడించారు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన భారత మార్కెట్ ను షేక్ చేయడం ఖాయం అనే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. అమెరికా డైరీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున దేశంలోకి దిగుమతి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వెన్న, నెయ్యితో పాటుగా పెరుగు కూడా అమెరికా నుంచి ఎగుమతి చేయనున్నారు.
Also Read : గండికోటలో దారుణం.. మైనర్ బాలిక మృతి..!
అదే విధంగా గోధుమలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వ్యవసాయ రంగ ఉత్పత్తులపైనే అమెరికా ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇక పౌల్ట్రీ ఉత్పత్తులపై డోనాల్డ్ ట్రంప్ దృష్టి సారించారు. చికెన్ లెగ్ పీస్ లకు సంబంధించి గతంలో వివాదం రేగింది. అమెరికాలో వినియోగించని, భారత్ లో వినియోగించే లెగ్ పీస్ లను దేశంలోకి దిగుమతి చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కోడి గుడ్లను కూడా భారత్ కు పంపే యోచన చేస్తోంది అమెరికా. దీని కారణంగా భారత్ లో కీలకమైన వ్యవసాయ రంగాన్ని టార్గెట్ చేసే అడుగులు వేస్తోంది అమెరికా.




