ఇరాక్, ఇజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధం తీవ్రం రూపం దాలుస్తోంది. ఈ ప్రభావం ప్రపంచంపై కూడా పడే సంకేతాలు కనపడుతున్నాయి. అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో యుద్ద తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇరాన్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులకు దిగుతోంది. ఇక ఇజ్రాయిల్ నుంచి ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళింది. ఇరాన్ అధ్యక్షుడిని హతమార్చే దిశగా ఇజ్రాయిల్ అడుగులు వేస్తోంది. దీనితో అధ్యక్షుడిని బంకర్ లో దాచింది ఇరాన్.
Also Read : బిగ్గెస్ట్ సైబర్ అటాక్.. మెయిల్ పాస్వార్డ్ చేంజ్ చేసుకోండి
తాజాగా ఇరాన్ లో మరో సైనికాధికారిని కాల్చి చంపింది ఇజ్రాయిల్. పశ్చిమ ఇరాన్‌లో కుడ్స్ ఫోర్స్ కాల్పుల్లో టాప్ కమాండర్ మృతి చెందినట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ నుండి 1,000 కి.మీ దూరంలో ఉన్న పశ్చిమ ఇరాన్‌లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని ఖుడ్స్ ఫోర్స్ యూనిట్ కమాండర్ బెహ్నామ్ షహ్రియారిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. ఇరాన్ ప్రాంతీయ ఆయుధ నెట్‌వర్క్‌కు షహ్రియారి కీలక రూపశిల్పి.
Also Read : రప్ప రప్ప ఎవరిని నరుకుతావ్ జగన్..? పయ్యావుల అదిరిపోయే కౌంటర్
ఇక ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలతో పాటుగా మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ కు మద్దతు తెలిపుతున్న ఉగ్రవాద గ్రూపులకు ఆయుధాలు, ఏటా వందల మిలియన్ల డాలర్ల నగదును బదిలీ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు అని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇజ్రాయిల్ సైన్యంపై జరిగే దాడులకు కూడా ఆయన నాయకత్వం వహించినట్టు ఇజ్రాయిల్ తెలిపింది. సీనియర్ ఇరాన్ కమాండర్ సయీద్ ఇజాది కోమ్ కూడా కాల్చి చంపామని తెలిపింది. ఇప్పటికే పలువురు కీలక సైనిక అధికారులను ఇరాన్ కోల్పోయింది.