Saturday, September 19, 2026 07:14 PM
Saturday, September 19, 2026 07:14 PM

సజ్జల అరెస్ట్ ఖాయం.. లోకేష్ ట్వీట్ ఇచ్చిన సిగ్నల్..?

అమరావతి విషయంలో ముందు నుంచి విషం కక్కుతూ వస్తున్న వైసీపీ నేతలు.. ఇటీవల సాక్షి ఛానల్ ద్వారా చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. అమరావతి వేశ్యలకు రాజధాని అంటూ మాట్లాడిన మాటలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలతో పాటుగా సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. ముందు నుంచి అమరావతి లేదంటే విజయవాడ ప్రాంత మహిళల గురించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో తాజాగా పోలీసులు.. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : వైసీపీలో నువ్వుంటే చాలంటున్న టీడీపీ నేతలు..!

ఈ అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన వైసీపీ నేతలు కొందరు ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. అందులో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఉన్నారు. మహిళల గురించి కూడా ఆయన అదే తరహాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. సంకర జాతి అంటూ నిరసన కార్యక్రమాలు చేసే వారి గురించి కామెంట్ చేసారు సజ్జల. కొమ్మినేని, జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పై ఎలాంటి బాధ వ్యక్తం చేయకపోగా మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్నికి ఆజ్యం పోశారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్న సజ్జల చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనను అరెస్ట్ చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

Also Read : అది సంకర జాతి కాదా సజ్జల..?

సజ్జల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. దీనితో అరెస్ట్ కావడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు. మహిళల పై తప్పుడు వ్యాఖ్యలు చేసింది కిరణ్ అయినా, సజ్జల అయినా కొమ్మినేని అయినా చర్యలు తప్పవని ట్వీట్ చేశారు. వైసీపీ వర్గాల్లో సైతం దీని గురించి చర్చ జరుగుతోంది. గత రెండు నెలల నుంచి సజ్జల అరెస్ట్ గురించి వార్తలు వస్తున్నా.. దీనిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అరెస్ట్ చేసే సంకేతాలు కనపడుతున్నాయి. సజ్జలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటుగా మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేయవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో నష్టం జరుగుతుందని భావించిన చాలా మంది నేతలు ఇప్పటికే సైలెంట్ గా ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్