Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

టార్గెట్ భారత్ ఏజెంట్లు.. జ్యోతి విచారణలో సంచలనాలు

భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఇటీవల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. ఉత్తర భారతంలో పాకిస్తాన్ ఏజెంట్ లను పోలీసులు వరుసగా అదుపులోకి తీసుకుంటున్న సమయంలో.. కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల హర్యానాకు చెందిన జ్యోతి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను విచారిస్తున్న అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు.

Also Read : సాయి సుదర్శన్ స్పాట్ ఫిక్స్..?

భారత రహస్య ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఉపయోగించుకుంటోందని గుర్తించారు. ప్రస్తుతం ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్న మల్హోత్రాను జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, హర్యానా పోలీసులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది. మల్హోత్రా, ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లు బయటకు లాగారు. దేశ రహస్య కార్యకలాపాలకు సంబంధించిన కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నారు అని గుర్తించారు.

Also Read : ముంబైలో అంతా సెట్ చేసిన నానీ..? టీడీపీ ఆరోపణ నిజమేనా..?

ఒక మెసేజ్ లో హసన్.. జ్యోతిని అట్టారి సరిహద్దుకు వెళ్ళినప్పుడు ఎవరైనా రహస్య ఏజెంట్లు స్పెషల్ ప్రోటోకాల్ అందుకున్నట్లు గమనించారా అని అడిగాడు. “ప్రోటోకాల్” మరియు “అండర్ కవర్ ఏజెంట్” వంటి పదాలను ఇద్దరూ ఎక్కువగా వాడారు. 2023లో 324వ వైశాఖి ఉత్సవం సందర్భంగా తొలిసారి పాకిస్తాన్‌ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా.. పలువురు అధికారులను కూడా కలిసారని గుర్తించారు. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఎహ్సాన్ దార్ అలియాస్ డానిష్ సహా పాకిస్తాన్ అధికారులతో ఆమెకున్న సంబంధాలను బయటకు లాగుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్