Thursday, May 7, 2026 02:09 AM
Thursday, May 7, 2026 02:09 AM

పంత్ కు ఏమైంది..? 27 కోట్ల ఒత్తిడిలో ఉన్నాడా..?

అంతర్జాతీయ క్రికెట్ లో రిషబ్ పంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్ధి ఎవరైనా సరే తన దూకుడుతో చుక్కలు చూపిస్తూ ఉంటాడు పంత్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మైదానాల్లో అతని దూకుడు చాలా సందర్భాల్లో భారత్ కు కలిసి వచ్చింది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో పంత్ ఆట తీరు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. దూకుడుగా ఆడటమే కాకుండా కీపింగ్ లో ప్రత్యర్ధులపై ఒత్తిడి పెంచుతూ ఉంటాడు. టెస్ట్ క్రికెట్ లో మరుపురాని విజయాలను కూడా అందించాడు ఈ యువ ఆటగాడు.

Also Read : బ్యాటింగ్ ఓకే.. బౌలింగ్ పైనే ప్రశ్నలన్నీ

అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ విషయానికి వస్తే.. పంత్ ఆట తీరు దారుణంగా ఉంది. గత ఐపిఎల్ సీజన్లలో అదిరిపోయే ఆట తీరుతో దుమ్ము రేపిన పంత్.. ఈ ఏడాది సీజన్ లో మాత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. భారీ షాట్ లు ఆడే ఈ ఆటగాడు.. టెస్ట్ క్రికెట్ తరహాలో ఎక్కువగా డిఫెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం, షాట్ లు ఆడే బంతులకు కూడా వికెట్ పారేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా ఒక ఆటగాడు ఫాం కోల్పోతే పెద్ద విషయం కాదు గాని.. ఈ ఏడాది పంత్ ను కొన్న ధరే అతని మీద ఒత్తిడి పెంచేసింది అని చెప్పాలి.

Also Read : ఇంగ్లీష్ టూర్‌కు ఆ ముగ్గురూ ఫిక్స్..?

పంత్ ను ఏకంగా 27 కోట్లు ఖర్చు చేసి లక్నో కొనుగోలు చేసింది. బహుసా ఈ ఒత్తిడిలో ఏమైనా పంత్ ఉన్నాడేమో గాని.. అతను మాత్రం ఒక్క మ్యాచ్ లో కూడా అతనికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేదు. కెఎల్ రాహుల్ ను వదులుకుని.. పంత్ కు భారీ ధర పెట్టిన లక్నో యాజమాన్యం, అతని ఆట తీరుతో షాక్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆడటం లేదా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ సీజన్ లో పంత్ చేసింది కేవలం 128 పరుగులు మాత్రమే. కేవలం ఆరు సిక్సులు 11 ఫోర్లు మాత్రమే కొట్టాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్