Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

అసలు దొంగ బీహార్ పారిపోయాడు: రఘురామ

తనను అరెస్ట్ చేసి టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడు బీహార్ పారిపోయాడు అంటూ ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సంచలన కామెంట్స్ చేసారు. తనను కొట్టలేదు అని రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ప్రభావతిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. సుప్రీం కోర్టు ఒక్కరోజు ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా చాలు… ఆమెకు అన్ని గుర్తుకు వస్తాయని.. ఈనెల 24వ తేదీన సుప్రీం కోర్టు లో మళ్లీ విచారణ… న్యాయస్థానం మళ్లీ ప్రొటెక్షన్ ఇస్తే ఆమెకు ఏది గుర్తుకు రాదన్నారు.

Also Read : జూన్‌ 12న ఏపీలో సంచలన అడుగు

లేకపోతే అన్నీ గుర్తుకు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు రఘురామ. సీతారామాంజనేయులు అరెస్టుతో నా కస్టోడియల్ టార్చర్ కేసు మరింత వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. నేను ఒక బాధితుణ్ణి… లాకప్ లో నన్ను చితక్కొట్టారన్నారు. నా పరిస్థితిని అందరూ కల్లారా చూశారు… ఎందరో నాయకులు ఎన్నో సమావేశాలలోనూ చెప్పారని వెల్లడించారు. మిలటరీ హాస్పిటల్ ఇచ్చిన నివేదికలో లాకప్ లో చిత్రహింసల వల్ల అయిన గాయాల ఆనవాళ్లు ఉన్నాయన్నారు.

Also Read : ఢిల్లీలో బిజీ బిజీగా బాబు

అయినప్పటికీ ఇప్పటికి ఇద్దరినీ మాత్రమే అరెస్టు చేశారు… ఓ మహిళ అయినా కూడా ఆమె భలే తప్పించుకుంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక తనను కొట్టిన వారిలో సునీల్ నాయక్ అనే వ్యక్తి కీలకమని.. కొట్టిన రోజు అతను పక్కన గదిలోనే ఉన్నాడని, ఆదేశాలు ఇచ్చింది అతనే అంటూ వ్యాఖ్యలు చేసారు. సునీల్ నాయక్ సుమోటోగా నాపై కేసు పెట్టాడు… ప్రస్తుతం ఆ జైలు ఈ జైలు అని తిరుగుతున్న బొరుగడ్డ అనిల్ దానికి సాక్షి సంతకం చేశాడన్నారు.

ఇటువంటి సాక్షికి ఎటువంటి సాక్షులు దొరుకుతారనేది బొరుగడ్డ అనిల్ అనే వాడిని చూస్తేనే… వీరు ఎంత గొప్పవాళ్లు సమాజానికి అర్థమవుతుందన్నారు. సునీల్ నాయక్ అసలు దొంగ… అతడు బదిలీపై బీహార్ కు వెళ్లాడని.. వాడికి ఎక్స్ టెన్షన్ ఇస్తానని చెప్పారేమో… చెప్పిన వెధవ పనులన్నీ చేసేవాడన్నారు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో A1 పీవీ సునీల్ కుమార్ అయితే, A2 సీతా రామాంజనేయులు అని వ్యాఖ్యానించారు.

Also Read : యుద్ధంలోనే పుట్టాం.. యుద్దమే చేస్తాం

ఈరోజు ఉదయం 9 గంటలకు సీతారామాంజనేయులు ని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా టీవీ మాధ్యమాల ద్వారా ఓ శుభవార్త విన్నాను

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్