Saturday, September 13, 2025 12:41 AM
Saturday, September 13, 2025 12:41 AM
roots

ఆ జెండా మాదే.. వదిలేది లేదు..!

నందమూరి కుటుంబంలో గొడవలున్నాయి.. నందమూరి, నారా కుటుంబాల మధ్య మాటల్లేవు.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు తెలుగుదేశం పార్టీ జెండా కూడా పట్టుకోరు.. ఇవే పుకార్లను పదే పదే చేస్తున్నారు వైసీపీ నేతలు. 2009 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించిన తర్వాత.. చంద్రబాబు పక్కన పెట్టేశాడనేది ప్రధాన ఆరోపణ. అది కూడా కొడుకు నారా లోకేష్ కోసం తారక్‌ను రాజకీయాల్లోకి రాకుండా తొక్కేశారంటూ ఎన్నో పుకార్లు పుట్టించారు. తారక్‌ రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబు, లోకేష్ అడ్డుకుంటున్నారనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఇక కొంతమంది అయితే మరో అడుగు ముందుకు కూడా వేశారు.

Also Read: హైదరాబాద్ ను వేటాడుతున్నాడు..!

తారక్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడని.. జగన్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని.. అందుకే తారక్ అభిమానులు కూడా టీడీపీకి ఓటు వేయటం లేదనేది వైసీపీ నేతల ప్రచారం. నందమూరి తారక రామారావు మా తాత.. ఆయన పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఈ కట్టే కాలే వరకు నేను టీడీపీతోనే ఉంటా.. టీడీపీ జెండా మాత్రమే మోస్తా… అని ప్రకటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు.. తారక్. వాస్తవానికి 2009 ఎన్నికల్లో ప్రచార సమయంలో ప్రమాదానికి గురైన తర్వాత తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో కూడా టీడీపీకీ ఓటు వేయాలంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇచ్ఛాపురం నుంచి ఖమ్మం వరకు పర్యటన చేశారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. రాజకీయాలకు దూరమయ్యారు. కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు రాజకీయాలను పక్కన పెట్టారు.

Also Read: విషమంగా నాని ఆరోగ్యం.. అత్యవసరంగా ముంబై తరలింపు

కొడాలి నాని పార్టీ మారిన సందర్భంలో అంతా తారక్‌ను టార్గెట్ చేశారు. ఆ సమయంలో ఒకటికి పదిసార్లు క్లారిటీగా చెప్పేశారు జూ ఎన్టీఆర్. తాను టీడీపీలోనే ఉన్నాను.. ఉంటాను అని తేల్చేశారు. దీంతో ఆ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్టీఆర్ జయంతి, వర్థంతి సమయాల్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద అలంకరణ సరిగ్గా లేదని తారక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అనుకూలంగా మార్చుకున్న వైసీపీ నేతలు.. తారక్ ‌పార్టీ మారుతున్నాడని ప్రచారం చేశారు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో తారక్ పాల్గొనలేదు. ఆ కార్యక్రమాన్ని బాలకృష్ణ నిర్వహించారు. రామ్ చరణ్‌ను పిలిచారు తప్ప.. తారక్‌ను పిలవలేదంటూ సోషల్ మీడియాలో అభిమానులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు కూడా. వీటన్నిటికీ తారక్ స్వయంగా బ్రేక్ వేశారు. తమకు నారా కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవని… నందమూరి కుటుంబం మొత్తం కలిసే ఉందని క్లారిటీ ఇచ్చేశారు.

Also Read: వర్మ కోసం వైసీపీ మైండ్ గేమ్..!

తాజాగా కళ్యాణ్ రామ్ కూడా తమపై విమర్శలు చేస్తున్న వారి నోళ్లకు తాళం వేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా పాట విడుదల సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించారు. ఆ సమయంలో ఓ అభిమాని తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీ జెండాను అడిగి మరీ తీసుకున్నారు. ఇది మన జెండా అన్నట్లుగా ఊపారు.. దీంతో అక్కడికి వచ్చిన నందమూరి అభిమానులు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత దర్శి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి నివాసానికి ప్రత్యేకంగా వెళ్లారు కల్యాణ్ రామ్. లక్ష్మీ ఇంట్లోనే బస చేశారు. దీంతో తామంతా టీడీపీతో ఉన్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కళ్యాణ్ రామ్. నందమూరి, నారా కుటుంబాల మధ్య నో వార్ అని డిక్లేర్ చేసేశారు. మరి ఇప్పటికైనా వైసీపీ పేటీఎం బ్యాచ్ సైలెంట్ గా ఉంటుందో లేదో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

3 COMMENTS

  1. ఒరిజినల్ గా జెండా నందమూరి వారిదే వారు ఎప్పుడైనా ఎక్కడైనా సరే పార్టీ పరంగా ప్రచారం చేయవచ్చు అలాగే ఇంట్రెస్ట్ ఉంటే మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది రెండు కుటుంబాల మధ్య ఒక అవగాహనతో కూడిన ఒప్పందం

  2. TDP PAYTM బ్యాచ్ తెలుగుదేశం జెండా నందమూరివారిది నారావారిది కాదు 1983 లో నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు

Comments are closed.

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్