బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ది ఖచ్చితంగా డిఫరెంట్ స్టైల్. అతను ఏ సినిమా చేసినా సరే హిట్ అవుతుంది అనే ధీమా ఫాన్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఇక సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ కూడా అతనికి ప్లస్ పాయింట్. అయితే గత కొన్నాళ్ళుగా సల్మాన్ ఖాన్ తెలియకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడైతే లారెన్స్ బిష్ణోయ్ అతన్ని టార్గెట్ చేశాడో అక్కడి నుంచి సల్మాన్ ఖాన్ తీవ్ర ఒత్తిడిలో కనపడుతున్నాడు. అతని క్లోజ్ ఫ్రెండ్, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ ను లారెన్స్ గ్యాంగ్ చంపాక ప్రాణ భయంతో బ్రతుకుతున్నాడు.
Also Read : విషమంగా నాని ఆరోగ్యం.. అత్యవసరంగా ముంబై తరలింపు
స్వేచ్ఛగా బయట తిరిగే సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నాడు. కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా కూడా సల్మాన్.. లారెన్స్ గ్యాంగ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతను హోస్ట్ గా వచ్చే బిగ్ బాస్ షోలో కూడా స్వేచ్ఛగా పాల్గొనలేని పరిస్థితి. ఇంటిపైనే కాల్పులు జరపడం, ఇటీవల సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి జరగడం.. ఇవన్నీ సల్మాన్ ను బయటకు రావాలి అంటేనే భయపడేలా చేసాయి.
Also Read : ఎన్టీఆర్ పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక విదేశాల్లో ఏదైనా ఈవెంట్ నిర్వహించాలన్నా సరే కంగారు పడిపోతున్నాడు. ఇటీవల కెనడా పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ కూడా వెళ్లాలంటే సల్మాన్ ఖాన్ లో తెలియని భయం. కనీసం తన ఫ్యాన్స్ ను కూడా కలవలేని పరిస్థితిలో సల్మాన్ ఖాన్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ టైంలో వచ్చిన సికిందర్ సినిమా సల్మాన్ ఖాన్ కు కాస్త రిలీఫ్ ఇస్తుందని భావించారు. తీరా చూస్తే సినిమా రిజల్ట్ దారుణంగా ఉంది.
Also Read : ఎమ్మెల్సీ దువ్వాడ.. డాక్టరేట్‌లో నిజమెంత?
సికిందర్ షూటింగ్ సమయంలో కూడా.. సల్మాన్ ఖాన్ ఫోకస్ పెట్టలేకపోయాడు. డైరెక్టర్ కు, నిర్మాతలకు ఎన్నో షరతులు పెట్టాడు. షూటింగ్ లోకేషన్స్ కూడా సల్మాన్ ఖాన్ ఫైనల్ చేసుకున్నాడు. దీనితో సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయిలో రాలేదు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక కథలో కూడా చాలా మార్పులు చేయించాడు. ముంబైలోని కీలక ప్రాంతాల్లో షూటింగ్ ఉన్న సీన్స్ ను కూడా మార్చేశాడు. దీనితో సినిమాలో పట్టు లేకుండాపోయింది. తన గత సినిమాలు బజరంగీ భాయీ జాన్, కిక్, దబాంగ్, టైగర్ జిందా హై, సుల్తాన్, భరత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏక్ థా టైగర్, టైగర్ -3 చిత్రాలకు వచ్చిన రెస్పాన్స్ ఈ సినిమాకు రాలేదు. చివరకు హీరోయిన్ శ్రద్దా కపూర్ 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినా సల్మాన్ ఖాన్ మాత్రం అడుగు పెట్టలేకపోయాడు.