దేశంలో నెలకొన్న భద్రతా.. సమస్యలతో పాకిస్తాన్ క్రికెట్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. చాన్నాళ్ల తర్వాత ఆ దేశంలో ఒక మెగా టోర్నమెంట్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో నిర్వహిస్తే.. ఆ దేశానికి నష్టం మినహా లాభం రాలేదట. ఈ విషయం అక్కడి స్థానిక మీడియానే బయటపెట్టింది. డాన్ పత్రిక కథనం ప్రకారం.. ఆ దేశ క్రికెట్ బోర్డ్ దాదాపుగా 85 మిలియన్ డాలర్లు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కారణంగా నష్టపోయినట్లు వెల్లడించింది. ఆతిథ్య దేశమైనా… సరే పాకిస్తాన్ స్వదేశంలో ఆడింది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే.
Also Read :సునీత విలియమ్స్ జీతం ఎంత..? ఈ 9 నెలలకు ఆమె ఎంత తీసుకుంటుంది..?
లాహోర్లో ఆడిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పై పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా భారత్ తో ఆడిన మ్యాచ్ లోను ఆ జట్టు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక బంగ్లాదేశ్ తో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీనితో టోర్నీలో ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేకుండా పాకిస్తాన్ నిష్క్రమించింది. ఇక టోర్నీ నిర్వహణ కోసం భారీగా ఖర్చుపెట్టి ఆదాయాన్ని భారీగా లెక్కేసుకుంది పాకిస్తాన్. ఈ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు.. 18 బిలియన్ పాకిస్తాన్ రూపాయలను ఖర్చు పెట్టింది.
Also Read :వైసీపీ ఎమ్మెల్సీని ఆడుకున్న మంత్రులు
అంటే 58 మిలియన్ డాలర్లను దాదాపుగా ఖర్చు చేసినట్లు ఆ మీడియా తన నివేదికలో వెల్లడించింది. రావల్పిండీ, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునీకరణ కోసం ఈ నిధులను వెచ్చించింది. ఇది అంచనా వేసిన బడ్జెట్ కంటే 50% ఎక్కువ. దీనితో పాటు ఈవెంట్ సన్నాహకాల కోసం.. 40 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అయితే హోస్టింగ్ ఫీజులో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు కేవలం 6 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయట.
Also Read :వర్మ కోసం పవన్ పర్మినెంట్ ప్లాన్..!
ఇక టికెట్ అమ్మకాలు.. స్పాన్సర్షిప్పుల రూపంలో వచ్చిన ఆదాయం చాలా తక్కువ అని అక్కడ మీడియా పేర్కొంది. దీనితో ఆ దేశ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు కేవలం 6 మిలియన్ డాలర్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు డాన్ పత్రిక తన కథనంలో ప్రస్తావించింది. దీనితో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటివరకు ఆటగాళ్లకు ఫైవ్ స్టార్ హోటల్స్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చింది. ఇకనుంచి వాళ్లకు ఎకానమీ హోటల్స్ లోనే రూమ్స్ బుక్ చేయనున్నారు. అలాగే నేషనల్ టి20 ఛాంపియన్షిప్ లో పాల్గొనే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 90 శాతం వరకు కోత విధించాలని నిర్ణయం తీసుకున్నారట.