Sunday, March 22, 2026 01:15 PM
Sunday, March 22, 2026 01:15 PM

కాంగ్రెస్ లో దొంగలు.. రాహుల్ గాంధీ సంచలనం

గత కొన్నాళ్లుగా క్రమంగా బలహీనపడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో పుంజుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. అహ్మదాబాద్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బిజెపి కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ.

Also Read : అమరావతి సమీపంలో మెగా టూరిజం స్పాట్..!

మన బాధ్యతలు నెరవేర్చే అంతవరకు అధికారం ఇవ్వమని.. గుజరాత్ ప్రజలను అడగకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బాధ్యతలు నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రజలు తమకు ఓటు వేయరని.. మూడు దశాబ్దాలుగా బిజెపి అందించిన పరిపాలన విఫలమైందని, గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెండు రకాల వారు ఉన్నారన్నారు.

Also Read : మరోసారి పార్లమెంట్ కు అశోక్ గజపతి రాజు…!

నిజాయితీగా పనిచేస్తూ, ప్రజలను గౌరవిస్తూ వారి కోసం పోరాడే వారు, పార్టీ సిద్ధాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకునేవారు ఒక రకమైతే… రెండో రకానికి వస్తే ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా వారితో దూరంగా ఉండటమే కాకుండా, గౌరవం కూడా ఇవ్వరని, ఇందులో సగం మంది బిజెపి నేతలతో కలిసి ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు బిజెపి నేతలతో స్నేహం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్