టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఓ వార్త ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతుంది. గత ఏడాది టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యాడని.. సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది భారత్ లో జరిగిన న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి.. దానికి తోడు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడటం జరిగాయి.
Also Read : అఖిల్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. నాగార్జున నమ్మకం అదే..?
దీనితో అతను క్రికెట్ నుంచి తప్పుకోవాలని, భారత క్రికెట్ కు రోహిత్ శర్మ చేసిన సేవలు చాలు.. అని చాలామంది మాజీ క్రికెటర్లు కూడా ఒత్తిడి చేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తాడని అందరూ ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు రోహిత్ శర్మ నుంచి సరైన ఇన్నింగ్స్ రాలేదు. సాధారణంగా ఐసిసి టోర్నీలో దూకుడుగా పరుగులు చేసే రోహిత్ శర్మ.. త్వరగానే వికెట్ పారేసుకుంటున్నాడు. దీనితో అతను క్రికెట్ నుంచి తప్పుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
Also Read : మరోసారి పార్లమెంట్ కు అశోక్ గజపతి రాజు…!
అటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు కూడా రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్.. రోహిత్ శర్మ కెరీర్ లో ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని వార్తలు వస్తున్నాయి. అయితే మరి కొంతమంది మాత్రం వైట్ బాల్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకుని.. కేవలం టెస్ట్ క్రికెట్లో మాత్రమే కొనసాగుతాడని, ఈ ఏడాది జరగబోయే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ నుంచి కీలక ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.