వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి నోటికి పని చెప్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కాస్త ఫేమస్ అవుతున్న దువ్వాడ.. రాజకీయంగా కూడా విమర్శలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. నెలనెలా సీఎం చంద్రబాబు నాయుడు నుంచి 50 కోట్లు తీసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు మొదట రోజున దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచాయి.
Also Read : దువ్వాడకు డీజే మోత ఖాయమా..?
తాజాగా దీనిపై అమలాపురంలో కేసు నమోదయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా.. అమలాపురంలో దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులకు జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని.. మళ్లీ ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు ఉండాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవర్ డ్రైవ్..!
దువ్వాడ శ్రీనివాస్ పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అప్పట్లో బూతులు మాట్లాడిన కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.. త్వరలోనే దువ్వాడ శ్రీనివాసును కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అటు వ్యక్తిగత వ్యవహారాలతో కూడా పార్టీ పరువు.. దువ్వాడ శ్రీనివాస్ తీశారని వైసీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటివరకు దువ్వాడను వైయస్ జగన్ సస్పెండ్ చేయకపోవడం పై కూడా వైసిపి కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.