టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత టెస్టు అలాగే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను ఎవరు చేపడతారు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రోహిత్ శర్మ మహా కొనసాగితే మరో ఏడాది పాటు క్రికెట్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత జట్టులో ఎవరు కెప్టెన్ అవుతారనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే పలువురు ఆటగాళ్ల పేర్లు వార్తల్లో నిలిచినా… ఎవరిపై స్పష్టత లేదు. అయితే టెస్ట్ క్రికెట్ సంగతి పక్కన పెడితే.. వన్డే క్రికెట్ విషయానికి వస్తే శుభమన్ గిల్ పేరును బోర్డు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?
ఇంగ్లాండ్ తో సిరీస్ కు గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దాదాపుగా కెప్టెన్సీ మార్పు ఉండే సంకేతాలు కనబడుతున్నాయి. టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మను.. మరో ఏడాది పాటు కెప్టెన్ గా కొనసాగించి.. ఆ తర్వాత కెప్టెన్ ను మార్చాలని భావిస్తున్నారు. ఈలోపు వన్డే క్రికెట్ కు కెప్టెన్ ను మారిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు గిల్. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండు వన్డే మ్యాచ్లో 60 పరుగులతో రాణించాడు.
Also Read : బిజెపి ఆదేశాలు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్
గతంలో కూడా అతని ఆట తీరుపై ప్రశంసలు వచ్చాయి. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ కూడా చేసిన గిల్ ను ఖచ్చితంగా కెప్టెన్ ను చేయాలి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ టీం ను సమర్థవంతంగా నడిపించిన ఈ పంజాబీ ఆటగాడు.. కచ్చితంగా వన్డే క్రికెట్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అటు బోర్డు కూడా ఇదే భావిస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలకు మరో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గిల్ అయితే సమర్థవంతంగా నడిపించగలడు అనే భావనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు సమాచారం.