Saturday, September 13, 2025 03:17 AM
Saturday, September 13, 2025 03:17 AM
roots

ఫాంలోకి వచ్చిన కెప్టెన్.. మరి మాజీ కెప్టెన్..?

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేసాడు. దాదాపు ఆరు నెలల నుంచి ఫామ్ కోల్పోయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక రోహిత్ శర్మ పని అయిపోయింది అనుకునే వాళ్లందరికీ… అతను ఆడిన ఇన్నింగ్స్ ఓ సంచలనం అనే చెప్పాలి. తన ఆటలో మళ్లీ మునుపటి గ్రేస్ కనపడిందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు రోహిత్ శర్మను విమర్శించిన వాళ్లు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

Also Read: ర్యాంకులతో కూటమికి కొత్త తలనొప్పులు..!

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం ఖచ్చితంగా టీమిండియా కు మంచి పరిణామంగానే చెప్పాలి. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్ పైనే అందరి దృష్టి. గత కొన్నాళ్లుగా కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడే విషయంలో అతను బాగా ఇబ్బంది పడ్డాడు. ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ పెద్దగా ప్రభావం చూపించడం లేదు.

Also Read: “కల్తీ లడ్డు” కథ నడిపింది ప్రకాశం జిల్లా నేతే..?

దీనితో రాబోయే మూడో వన్డేలో అతను ఖచ్చితంగా సెంచరీ చేసి ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. వైట్ బాల్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటికే 51 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. త్వరలోనే తిరిగి ఫామ్ లోకి వచ్చి ఛాంపియన్ ట్రోఫీ ముందు భారత జట్టుకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అటు మరో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. ఓవైపు యంగ్ ప్లేయర్స్ జట్టులో చోటు కోసం ప్రయత్నం చేస్తుంటే సీనియర్ ఆటగాళ్లు మాత్రం ప్రభావం చూపించడంలో ఫెయిల్ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్