Sunday, March 22, 2026 01:12 PM
Sunday, March 22, 2026 01:12 PM

ఏపీలో వైసీపీ ఉందా.. లేదా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా… ఇప్పుడు ఇదే ప్రశ్న పార్టీ కార్యకర్తలను కూడా వేధిస్తోంది. నిజమే.. వైసీపీ అంటే జగన్.. జగన్ అంటే వైసీపీ అన్నట్లుగా పార్టీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. అంతే తప్ప మిగిలిన నేతలెవరూ బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రం తమ సొంత ఛానల్‌లో జరుగుతున్న డిబేట్‌లో కనిపిస్తున్నారు తప్ప… అసలు వైసీపీకి ఊనికే లేనట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పటి కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతలకు ఎక్కువ పని, గుర్తింపు కూడా ఉంటుంది. అందుకే టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రజలకు వివరించారు. చివరికి ఎన్నికల్లో విజయం సాధించారు కూడా.

Also Read  :బాలయ్య ఫ్యాన్స్ కు మైండ్ పోయే న్యూస్…?

అయితే వైసీపీలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. పార్టీ నేతలంతా ఏమయ్యారో తెలియటం లేదు. అసలు వైసీపీ ఉందా లేదా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ తన మకాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్‌కు మార్చేశారు. ఏదో చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నారు… అలా అలా తిరిగేసి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారు జగన్. ఇక వైసీపీ నేతలతో సమావేశం కూడా తాడేపల్లిలోని ప్యాలెస్‌లోనే నిర్వహిస్తున్నారు తప్ప… కాలు బయట పెట్టడం లేదు.

Also Read  :తెలంగాణా పల్లెల్లో ఎన్నికల నగారా..? రేవంత్ కీలక నిర్ణయం..!

పది రోజుల క్రితం జగన్ లండన్ వెళ్లారు. దీంతో వైసీపీ నేతలంతా మాయమైపోయారు. అధినేతే లేనప్పుడు మనకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన పెద్దలంతా ప్రస్తుతం ఏమయ్యారో తెలియటం లేదు. దీంతో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు కూడా మనకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంబటి రాంబాబు, రాజీవ్ రెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే… ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాత్రం అప్పుడప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి హడావుడి చేస్తున్నారు. అంతే తప్ప మిగిలిన నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే విషయంపై వైసీపీ నేతల వద్ద ప్రస్తావిస్తే… విజయసాయిరెడ్డి వంటి నేతలే జగన్‌కు దూరంగా పోతున్నారు. అలాంటి వారినే జగన్ ఆపలేకపోయారు… ఇక మాలాంటి వారి పరిస్థితి ఏమిటీ.. అంటున్నారు. పోనీ ప్రభుత్వంపై ఏదైనా విమర్శ చేద్దామా అంటే… వెంటనే.. ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తున్నారు కూటమి నేతలు. దీనికి సమాధానం చెప్పడం కంటే.. మూసుకుని కూర్చోవడం ఉత్తమం అంటున్నారు వైసీపీ నేతలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్