Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

నేను వస్తున్నా.. పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారా…? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆయన కసరత్తు పూర్తి చేశారా…? అంటే అవును అనే సమాధానం వినపడుతోంది. 2023లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకు రాలేదు. 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన ఆ తర్వాత శాసన సభా సమావేశాలకు కూడా హాజరయ్యే ప్రయత్నం చేయలేదు. రేవంత్ రెడ్డి పదేపదే సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ ను రెచ్చగొడుతున్న సరే కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

Also Read : గల్లా జయదేవ్ కి రాజ్య సభ సీటు దక్కేనా?

ఇక ఇప్పుడు మాత్రం కేసిఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి, కాంగ్రెస్ ఉమ్మడిగా ప్రయత్నం చేయడంతో ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ నేతలతో ఆయన వరుసగా స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ ఫోన్ వాడినట్లు ఎప్పుడు వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కేసిఆర్ ఫోన్ వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ గాడి తప్పింది అనే అభిప్రాయంలో ఉన్న కేసీఆర్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Also Read : తక్కువ నిద్రపోతున్నారా..? అయితే గుండెపోటు గ్యారెంటీ..!

ఉద్యమ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు స్వయంగా ఫోన్ వాడటం మొదలుపెట్టారు. పార్టీ నేతలకు ఫోన్ చేస్తూ ఎప్పుడు ఎవరు ఏం చేయాలో సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తున్నారు. ఇక పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేల విషయంలో కూడా కేసీఆర్ జాగ్రత్తగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేటీఆర్ తో విభేదించే ఎమ్మెల్యేలతో అలాగే పార్టీ సీనియర్ నేతలతో ఆయన స్వయంగా మాట్లాడుతూ జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ వార్తలు బయటకు రావడంతో గులాబీ పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. ఇక కెసిఆర్ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కచ్చితంగా బయటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్