ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 వరకు వైసిపి పెద్ద ఎత్తున మద్యం విషయంలో అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ నేతలు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో టిడిపి నేతలు వైసిపి పై ఈ విషయంలో ఘాటు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ ఒకరకంగా మద్యం విషయంలో అప్పట్లో ఇబ్బంది పడిందనే చెప్పాలి. కానీ తమ పార్టీ నేతలను కల్తీ మద్యం చేయకుండా అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారనే ఆరోపణలు సైతం వినిపించాయి.
Also Read : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రెబల్స్ తలనొప్పి..!
ఇక ఇప్పుడు టిడిపి నేతలు మద్యం వ్యవహారంలో ఎక్కువగా భాగస్వాములు కావడంతో అటు రాయలసీమలో ఇటు కృష్ణా జిల్లాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి వైసిపి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి రాయలసీమ ఎమ్మెల్యేలు గానీ, కొంతమంది కోస్తా ప్రాంతం ఎమ్మెల్యేలు గానీ వైసీపీ నేతలకు ఘాటు కౌంటర్లు ఇచ్చే విషయంలో విఫలమవుతున్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్న సరే ఆ అంశాన్ని కూడా టిడిపి నేతలు హైలెట్ చేయలేకపోతున్నారు.
Also Read : మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
రాయలసీమలో మంత్రులు కూడా సైలెంట్ గానే ఉంటున్నారనే ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్న సరే ఈ అంశానికి సంబంధించి టీడీపీ నేతలు ఘాటుగా మాట్లాడటం లేదు. ఇక నిందితుల విషయంలో పోలీసులు కూడా దూకుడు ప్రదర్శించి.. విదేశాలకు పారిపోయిన వారిని కూడా రాష్ట్రానికి రప్పించే పనిలో పడ్డారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావును సౌత్ ఆఫ్రికా నుంచి రప్పించి అరెస్టు చేశారు. గతంలో వైసిపి కనీసం పార్టీ నేతలను సస్పెండ్ కూడా చేయలేదు. కానీ టిడిపి నుంచి నాయకులలో సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ విషయాలను టిడిపి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.