ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో వైసీపీ మళ్ళీ విషం కక్కే కార్యక్రమాలు మొదలుపెట్టింది. 2019 నుంచి 2024 వరకు మూడు రాజధాని పేరుతో అమరావతికి అన్యాయం చేసిన వైఎస్ జగన్ అండ్ కో ఇప్పుడు మళ్ళీ అమరావతిని టార్గెట్ చేసుకొని కుట్రలకు పాల్పడుతుంది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇప్పటికే అమరావతిలో రోడ్ల నిర్మాణాల విషయంలో తమ మీడియా ఛానల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసిపి ఇక ప్రపంచ బ్యాంకు అలాగే ఏషియా బ్యాంక్ కు లేఖలు రాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : ఎన్టీఆర్‌ను రెచ్చగొడుతున్న వైసీపీ..!
రాజధాని అమరావతిలో పరిస్థితి బాగాలేదని.. రోడ్ల నిర్మాణాలు విషయంలో అలాగే శాశ్వత భవనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం లేదంటూ రుణాలు ఇవ్వద్దని.. లేఖలు రాయటం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే అమరావతిలో టెండర్లు పిలిచే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని.. నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇప్పటివరకు కట్టిన కొన్ని భవనాలు చేపట్టిన నిర్మాణాలు శాశ్వతం కాదని లేఖలు రాస్తున్నారు.
Also Read : పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ గురి
కట్టిన భవనాలు కూలిపోయే దశలో ఉన్నాయని కొన్ని వీడియోలు, ఫోటోలు ప్రపంచ బ్యాంకుకు అలాగే ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుకు వైసిపి మద్దతుదారులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఇటువంటి కార్యక్రమాలు గట్టిగానే జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఈ కార్యక్రమాలకు వైసిపి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే అమరావతి టెండర్లలో అవినీతి జరుగుతోందని అలాగే రోడ్ల నిర్మాణాలను జాతీయ హైవేలతో పోలుస్తూ కథనాలు రాయడం మొదలుపెట్టింది సాక్షి.