Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

తాడేపల్లిలో వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్.. జగన్ కొత్త ప్లాన్…!

వైయస్ జగన్ 2019లో అధికారంలోకి తీసుకువచ్చిన ఆ పార్టీ సోషల్ మీడియా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. వరుస కేసులతో ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందికర పోస్ట్లు పెడుతూ ప్రత్యర్థుల కుటుంబాలను అవమానించిన వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు భయంతో బతుకుతున్నారు. చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక వైసిపి నాయకత్వం కూడా వారిని అరెస్టు చేసిన తర్వాత పెద్దగా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

Also Read : పుష్పకు హ్యాండిచ్చిన త్రివిక్రమ్..?

ఈ తరుణంలో.. వైసీపీ సోషల్ మీడియా విషయంలో వైయస్ జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. తాడేపల్లిలో తన ఇంట్లోనే వైసీపీ సోషల్ మీడియా వార్ రూమ్ ను ఏర్పాటు చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి మద్దతుగా ఉండే దాదాపు 100 మంది వైసీపీ కార్యకర్తలతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారికి అన్ని విధాలుగా రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపడుతుంది వైసీపీ అధిష్టానం. కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో అలాగే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నెగిటివ్ ప్రచారం చేసే విధంగా వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహించే విధంగా జగన్ చర్యలు చేపడుతున్నారు.

Also Read : అమరావతి టార్గెట్ గా వైసీపీ కుట్ర..!

ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వైసిపి కార్యకర్తలకు జీతాలు ఇచ్చి తన పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికోసం ఒక ఆఫీసు కూడా సిద్ధం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రస్తుతం బలహీనపడటంతో ఎలాగైనా సరే బలపడాలని జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు సజ్జల భార్గవ్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా విషయంలో పక్కన పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఓ కీలక నేతకు సోషల్ మీడియా బాధ్యతలను జగన్ అప్పగించనున్నారు. ఆయన నేతృత్వంలోనే వైసీపీ సోషల్ మీడియా పనిచేయనుంది.

Also Read : ఢిల్లీ ఎన్నికల్లో యమునా పాలిట్రిక్స్‌..!

ఇప్పటికే ఆఫీస్ సిద్ధంకాగా ఫిబ్రవరిని చివరివారం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. ఇక త్వరలోనే వైసీపీ పోరుబాట కూడా సిద్ధం చేస్తుంది. ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటుగా తల్లికి వందనం కార్యక్రమాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని వైసీపీ ఇప్పటికి ఆరోపణలు చేస్తోంది. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్