Tuesday, October 28, 2025 04:20 AM
Tuesday, October 28, 2025 04:20 AM
roots

వైసీపీ.. మరీ ఇంత దారుణమా..!

151 సీట్లు గెలిచామన్న ఓవర్ కాన్ఫిడెన్స్… వై నాట్ 175 అనే నినాదం.. అసలు ప్రతిపక్షమే అవసరం లేదని ప్రకటన… చివరికి అదే ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో న్యాయపోరాటం… ఇదే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. బండ్లు ఓడలవుతాయి… ఓడలు బండ్లు అవుతాయనేది వైసీపీ విషయంలో అక్షర సత్యం. 2019 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన తర్వాత అధినేత ఒంటెద్దు పోకడలతో సరిగ్గా ఐదేళ్ల తర్వాత బొక్కబోర్లా పడింది వైసీపీ. కార్యకర్తలను పట్టించుకోకపోవడం… ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం… అభివృద్ధి అనే విషయం పూర్తిగా మర్చిపోవడం… తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెట్టడం… ఎవరైనా ఎదురు మాట్లాడితే వారిపై వ్యక్తిత్వ హననం చేయడం.. అవినీతి తారాస్థాయికి చేరడం… ఇలా ఒకటేమిటి… కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా వైసీపీకి 2024 మిగిలిపోయింది.

Also Read : తెలుగుదేశం.. పడిలేచిన కెరటం..!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మొదలైన వైసీపీ పతనం… ఎన్నికల్లో ఓటమితో ఓ లెవల్‌కు చేరుకుంది. వై నాట్ కుప్పం అని గొప్పలు చెప్పుకున్న జగన్… చివరికి తన సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితికి పడిపోయారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే వైసీపీని గెలిపిస్తాయనేది జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్. అలాగే పాదయాత్రలో ముద్దులతో, ఓదార్పులతో హామీల వర్షం కురిపించిన జగన్… ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని బ్రతిమిలాడారు. అయితే గెలిచిన తర్వాత నుంచి నా వల్లే పార్టీ గెలిచింది అనేలా మారిపోయారు. ఐదేళ్లు నియంత పాలన సాగించారు. పార్టీని, ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐ ప్యాక్ టీమ్ మాత్రమే నడిపించాయనేది వాస్తవం. దీంతో వైసీపీ నేతలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక ఎన్నికల సమయంలో కూడా ఐ ప్యాక్ టీమ్ సూచించిన వారికే జగన్ టికెట్లు కేటాయించారు. దీంతో… ఎన్నికలకు ముందే సగం మంది నేతలు పార్టీలు మారిపోయారు.

ఏపీకి కీలకమైన రాజధాని అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, అమరావతి రైతులపై కేసులు, ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం, జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం, చివరికి పీఆర్‌సీ పెంపు అంటూ కోత పెట్టడం, వారంలో సీపీఎస్ రద్దు అంటూ చేసిన ప్రకటనను గాలికి వదిలెయ్యడం, మద్యం, ఇసుక మాఫియా, యువగళం పాదయాత్రకు అడ్డంకులు, పవన్ విశాఖ పర్యటనలో ఇబ్బందులు.. ఇలా ఒకటేమిటి… ఎన్నో అంశాలు వైసీపీని ఇరుకున పెట్టాయనేది వాస్తవం. ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు వరకు పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితమైన జగన్… అప్పుడప్పుడు బయటకు వచ్చినా కూడా పరదాల మాటునే తిరిగారు. దీంతో పరదాల సీఎం అనే పేరు తెచ్చుకున్నారు కూడా. ఇక ఎన్నికలకు 3 నెలల ముందు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మర్చేశారు. ఐప్యాక్ టీమ్ సూచనలతో అభ్యర్థులను మార్చడంతో నేతలకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చివరి నిమిషంలో నియోజకవర్గం మారడంతో… అక్కడ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది విముఖత చూపారు కూడా. దీంతో కొత్త, పాత వారికి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో సమన్వయ లోపం కారణంగా నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.

Also Read : పొంగులేటి వ్యాఖ్యల వెనుక ఇంత కుట్ర ఉందా…?

వై నాట్ 175 అని గొప్పగా ప్రచారం చేసిన జగన్‌కు ఏపీ ప్రజలు ఓ రేంజ్‌లో బదులిచ్చారు. కేవలం 11 స్థానాలు మాత్రమే ఫ్యాన్ పార్టీ గెలిచింది. జగన్ మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారంతా ఓడిపోయారు. 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ… కేవలం నాలుగే స్థానాలు గెలుచుకుంది. అందులో 3 బీజేపీకి కేటాయించిన స్థానాలు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం పోరాటం చేస్తారని అంతా భావిస్తే… జగన్ మాత్రం… ఇప్పటి వరకు కేవలం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అది కూడా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అంటూ చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నాడు కూడా. కనీస సభ్యుల సంఖ్య లేకపోవడంతో టెక్నికల్‌గా హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్ తేల్చిచెప్పేశారు కూడా. దీంతో ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్.

ఇక ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. నా అనుకున్న వాళ్లే జగన్‌ను ఛీ కొట్టారు. బంధువు బాలినేని, మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలంతా జగన్‌కు గుడ్ బై చెప్పేశారు. పోతూ పోతూ జగన్ చేసిన అరాచకాలను ఏకరువు కూడా పెట్టారు. దీంతో వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఈవీఎంలపై విమర్శలు చేసిన వైసీపీ నేతలు… చివరికి బ్యాలెట్‌తో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపారు. దీంతో వైఎస్ కుటుంబానికి కంచుకోట పులివెందులలో కూడా ఫస్ట్ టైమ్ పసుపు జెండా రెపరెపలాడింది.

Also Read : ఏపీపై రైల్వే శాఖ వరాల జల్లు..!

ఓటమి తర్వాత జగన్ పూర్తిగా బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. ఏదో చుట్టపు చూపుగా నెలకోసారి తాడేపల్లికి వచ్చిన నేతలతో మీటింగ్ నిర్వహించి… మళ్లీ వెళ్లిపోతున్నారు. దీంతో అధినేత తీరుపై సగటు కార్యకర్త తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల అవినీతిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ద్వారంపూడి, మాజీ మంత్రి పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి అవినీతిని బయటపెట్టింది. వైసీపీ సోషల్ మీడియా సైకోలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో… పోసాని కృష్ణమురళి, శ్రీ రెడ్డి వంటి స్టార్లు కూడా తప్పైంది… క్షమించండి… ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడం అని కాళ్లబేరానికి వచ్చారు. ఇక 2024 ఏడాది వైసీపీకి చేదు గుళిక అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సిద్ధం అంటూ సభలు నిర్వహించినప్పటికీ… సభకు వచ్చిన వారు కూడా వైసీపీకి ఓటు వేసినట్లు లేదు అని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్