అందితే జుట్టు… అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. ఈ మాట వైసీపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. రెండు రోజులుగా ఒకే అంశాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ వైసీపీలో చేరుతాడు.. చేరుతున్నాడు.. చేరిపోయాడు.. అంటూ వైసీపీ సోషల్ మీడియాతో పాటు అనుకూల మీడియా కూడా రెండు రోజులుగా ప్రచారం చేస్తూనే ఉంది. ఇక మరికొందరైతే.. ఉగాది రోజు ఉదయం చేరుతారని అంటే.. లేదు సాయంత్రం స్వయంగా జగన్‌ను కలుస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఉగాది రోజు రాత్రి వరకు కూడా జగన్‌ను వర్మ కలవలేదు.. వర్మ వైసీపీలో చేరలేదు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అంటారు పెద్దలు. ఇక్కడ అదే సూత్రాన్ని తమకు అనుకూలంగా వాడుకునేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: నాగబాబుకు బ్రేక్.. కారణమిదే..!
ఇంకా చెప్పాలంటే వైసీపీ మైండ్ గేమ్ పక్కాగా ప్లాన్ చేసినప్పటికీ.. అది ఆశించిన ఫలితం మాత్రం చూపించలేదు. కూటమి నిర్ణయానికి కట్టుబడి… పార్టీ అధినేత చంద్రబాబు మాటను కాదనకుండా.. పిఠాపురం నియోజకవర్గం టికెట్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు వర్మ. అలాగే కూటమి అభ్యర్థి పవన్ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం కూడా చేశారు. ఇదే విషయాన్ని పవన్ స్వయంగా ప్రకటించారు. ఇక వర్మ చేసిన త్యాగాన్ని పార్టీ ఎప్పటికీ మర్చిపోదని… అతనికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తానంటూ చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. అయితే అనివార్య కారణాలతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మ పేరు లేదు. అదే సమయంలో పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి కూడా. ఈ విషయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు మైండ్ గేమ్ మొదలుపెట్టారు వైసీపీ నేతలు.
Also Read: బ్రేకింగ్: లావు భద్రతపై సర్కార్ అలెర్ట్
ముందుగా కొన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా జనసేన నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వర్మకు టీడీపీ అధినేత ఏ మాత్రం గుర్తింపు ఇవ్వటం లేదంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆ తర్వాత వర్మ వైసీపీలో చేరుతున్నాడంటూ పుకార్లు మొదలుపెట్టారు. ఒకదశలో అనుకూల పెయిడ్ మీడియా ద్వారా కూడా ఇదే విషయాన్ని పదేపదే వైసీపీ నేతలు చెప్పించారు. కొందరు యూట్యూబర్లు అయితే.. ఉగాది రోజు ముహుర్తం అని… ఇప్పటికే జగన్‌తో వర్మ పలుమార్లు చర్చించారంటూ కొత్త కొత్త పుకార్లు పుట్టించారు. ఇప్పుడు ఉగాది కూడా దాటిపోయింది. వర్మ మాత్రం అదే పిఠాపురంలో ఉన్నారు. అదే టీడీపీలో కొనసాగుతున్నారు. తన అభిమానులు, టీడీపీ కార్యకర్తల కోసం పని చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దీనికి వైసీపీ పెయిడ్ మీడియా ఏం సమాధానం చెబుతుందో చూడాలి.