వైసీపీలో ఒకటే చర్చ.. ఇంకా చెప్పాలంటే.. ఏపీ రాజకీయాల్లో కూడా ఇదే అంశంపై రాజకీయ విశ్లేషకులు కూడా నేరుగా చర్చిస్తున్నారు. అదే వైసీపీలో ఎవరి మాట వినాలి.. అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట వినాలా.. లేక వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినాలా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ చర్చకు ప్రధాన కారణం.. నాలుగు రోజుల క్రితం ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో పెద్ద దుమారం రేపాయి.
Also Read : టీటీడీలో వైసీపీ కోవర్టులు.. భూమన అరెస్టు ఖాయమా..?
వైసీపీ నేతలు ఏపీ రాజధాని అమరావతి విషయంలో తొలి నుంచి డబుల్ గేమ్ ఆడుతున్నారు. ముందు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడు సరే అన్నారు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. ఇక వైసీపీ ఓడిన తర్వాత ఇప్పుడు మళ్లీ అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ కొత్త పాట పాడారు. ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద దుమారం రేపుతోంది కూడా. సజ్జల ప్రకటన చేస్తే.. జగన్ చేసినట్లే అనేది బహిరంగ రహస్యం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించారు కూడా.
సజ్జల ఒక మాట చెబితే.. అది జగన్ చెప్పినట్లే అని అంతా భావించారు. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పినట్లే అనేది వైసీపీ నేతలు మాట. దీంతో నాటి నుంచి అమరావతిపై నెగిటివ్ ప్రచారానికి బ్రేక్ వేశారు కూడా. అప్పటి వరకు ప్రతి రోజు అమరావతి ముంపు, అలల రాజధాని, కమ్మ రాజధాని అని ప్రతి రోజూ తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ అభిమానులు.. సజ్జల ప్రకటన తర్వాత ఆ వ్యవహారం పూర్తిగా పక్కన పెట్టేశారు.
Also Read : ఇక చాలు.. 2029 తర్వాతే.. పవన్ కీలక నిర్ణయం
అయితే సజ్జల ప్రకటనపై జగన్ చాలా సీరియస్ అయ్యారని.. సజ్జలను పూర్తిగా పక్కకు తప్పుకోవాలని సూచించినట్లు కూడా వైసీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. వాస్తవానికి రాజధానిపైన సజ్జల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అధికార పత్రిక సాక్షి మీడియా ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. మరోవైపు ఆ రోజు నుంచి సజ్జల బయట కనిపించటం లేదు. దీంతో నిజంగానే సజ్జలను జగన్ తిట్టారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆరోజు నుంచి వైసీపీ నేతలు, కార్యకరర్తలు పార్టీలో ఎవరి మాట వినాలి అనే చర్చ నడుస్తోంది.
నిజానికి వైసీపీలో జగన్ కంటేసజ్జలకే ఎక్కువ ప్రాధాన్యత. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జలను ప్రభుత్వ ప్రధాన సలహాదారును చేశారు జగన్. నాటి నుంచి ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చివరికి సజ్జలపైన బాలినేని, ఆళ్ల, అవంతి, వాసిరెడ్డి పద్మ, మోపిదేవి వంటి నేతలు ఆరోపణలు చేసినా కూడా జగన్ మళ్లీ ఆయనకే కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో నిజంగానే సజ్జల మాటే ఫైనల్ అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరించారు. వైసీపీ పరాజయం తర్వాత కర్త, కర్మ, క్రియ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి సజ్జల పైన ఇప్పుడు జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారనే మాట.. వైసీపీలో ఒక వర్గానికి అస్సలు మింగుడు పడటం లేదు. వైసీపీ అంటే సజ్జల.. అన్నట్లుగా ఇంతకాలం కొనసాగింది. ఇప్పుడు సజ్జలను కూడా జగన్ పక్కన పెట్టారనే మాట.. వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది.
Also Read : నన్ను వదిలేయండి..జగన్ కు వల్లభనేని షాక్
అవసరం ఉన్నంత వరకే జగన్ ఎవరినైనా దగ్గరకు తీస్తారని.. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్లు ఏ స్థాయి నేత అయినా సరే.. పక్కన పెట్టేస్తారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయం ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదలు.. విజయసాయిరెడ్డి వరకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇప్పుడు సజ్జల కూడా జగన్ ఆగ్రహానికి గురయ్యారంటే.. రేపు మన పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు.