ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. ఎప్పుడు ఎవరు గుడ్ బై చెప్తారో అర్ధం కాక పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. కీలక నేతలు చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. కొందరు కేసుల భయంతో వైసీపీకి గుడ్ బై చెప్తుంటే మరికొందరు భవిష్యత్తు కోసం పక్క చూపులు చూస్తున్నారు. ఇక పార్టీలో ఉన్న కీలక నేతల వైఖరి నచ్చని కొందరు నేతలు సైతం ఇప్పుడు గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నారు. త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు.
వైసీపీకి భారీ షాక్ ఇవ్వబోతున్న కీలక నేతలు ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరు ఎంపీలు రేపు వైసీపీని వీడతారని ప్రచారం ఊపందుకుంది. వైసిపి ఆవిర్భావం నుండి కీలకంగా వ్యవహరించిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరూ టీడీపీ కండువా కప్పుకుంటారు.
ఇక వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఢిల్లీలో రేపు రాజ్యసభ ఛైర్మన్నుర కలిసి రాజీనామా పత్రాలిచ్చే అవకాశం కనపడుతోంది. వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేనలో త్వరలో చేరికలు ఉండే అవకాశం కనపడుతోంది. బీజేపీలో చేరేందుకు కొందరు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి. రాజ్యసభ లో బలం తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అంతే కాకుండా వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. ఆమె జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు.