Tuesday, October 21, 2025 09:41 AM
Tuesday, October 21, 2025 09:41 AM
roots

అంతా మా వల్లే.. క్రెడిక్ కోసం పాకులాట..!

మంచి జరిగితే మా వల్ల అంటారు.. అదే నష్టం జరిగితే మాత్రం.. నాకేం సంబంధం లేదు.. అంతా మీరే చేశారు అంటారు.. ఇదే ఇప్పుడు లోకం తీరు. మనిషి నైజం కూడా ఇలాగే ఉంది. ఏదైనా ఒక పని విషయంలో ముందు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేసిన వారే.. అది సక్సెస్ అయితే మాత్రం.. ఆ క్రెడిట్ కోసం నానా పాట్లు పడతారు. ఇలాంటి వారిలో ప్రస్తుతం వైసీపీ నేతలు ముందు వరుసలో ఉన్నారనేది వాస్తవం. ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. దానిని విమర్శించడం.. సక్సెస్ అయితే మాత్రం.. మా వల్లే అని చెప్పుకోవడం వారికి సర్వ సాధారణమైంది.

Also : బ్రేకింగ్: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్ లోకి ఎంపీ..?

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటేసింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి సర్కార్ అమలు చేస్తోంది కూడా. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని చెప్పినట్లుగానే షెడ్యూల్ ప్రకారం అమలు చేస్తున్నారు చంద్రబాబు. తల్లికి వందనం, పింఛన్ పెంపు, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ.. పధకాలను ఇప్పటికే అమలు చేశారు. అలాగే ఏపీలో పెట్టుబడుల కోసం చంద్రబాబు సర్కార్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. బడా సంస్థలతో ఇప్పటికే ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటోంది.

అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు.. ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది.. రైతులను మోసం చేశారు.. అంటూ కిందిస్థాయి కార్యకర్త మొదలు.. అధినేత జగన్ వరకు తెగ ప్రశ్నించారు. జగన్ అయితే మరో అడుగు ముందుకు వేసి.. మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో చేసిన ప్రచారాన్ని అనుకరిస్తూ.. సెటైర్లు వేశారు కూడా. నీకు 15, నీకు 15 అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వినుకొండలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శ సమయంలో కూడా మీకు పధకాలు అందాయా.. అంటూ ప్రశ్నించారు.

Also : ఇండో – అమెరికన్లకు బిగ్ షాక్.. వీసాల రివ్యూ స్టార్ట్..!

చంద్రబాబు ముందుగా చెప్పినట్లుగా చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తామన్నారు. అలాగే పాఠశాలలు తెరిచిన మొదటి రోజే తల్లికి వందనం డబ్బులు ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పారు. అయితే అప్పటి వరకు తెగ ప్రశ్నలు వేసిన వైసీపీ నేతలు.. చెప్పినట్లుగా జూన్ 12వ తేదీన తల్లికి వందనం డబ్బులు జమ కావడంతో.. కోత పెట్టారు.. మోసం చేశారంటూ మాట మార్చారు. జీవో మీ హయాంలో ఉన్నదే కదా.. అని రుజువులు చూపిస్తే.. సైలెంట్ అయ్యారు. ఇప్పుడు స్త్రీ శక్తి పధకంపై కూడా ఇదే తరహాలో వైసీపీ నేతలు నాలుక మడతెడుతున్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ముందుగా చెప్పినట్లుగానే ఆగష్టు 15 నుంచి ఈ పధకం అమలులోకి వచ్చింది. 8 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది మహిళలకు ఆర్టీసీలో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు వెల్లడించారు. దీని వల్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగిందన్నారు. అయితే ఈ పధకం ప్రకటించినప్పుడే కొన్ని నిబంధనలు పెట్టింది ఏపీ సర్కార్. 5 సర్వీసుల్లో మహిళలు ఫ్రీ చేసింది. అయితే ఘాట్ రోడ్‌లో అవకాశం కల్పించలేదు. దీంతో మహిళల నుంచి తిరుమల వెళ్లే బస్సుల్లో కూడా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. దీంతో మరోసారి సమీక్ష చేసిన ప్రభుత్వం.. తిరుమల బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also : టార్గెట్ బాబు, పవన్.. ప్రకాష్ రాజ్ కామెంట్..!

దీంతో వైసీపీ నేతలు మరోసారి రంగంలోకి దిగారు. వైసీపీ చేసిన పోరాటం వల్లే స్త్రీ శక్తి పధకం అమల్లోకి వచ్చిందని.. లేదంటే.. ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు ఈ పధకాన్ని చంద్రబాబు అమలు చేసే వారన్నారు. అలాగే వైసీపీ నేతలు చేసిన పోరాటం వల్లే.. తిరుమల బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి సర్కార్ అంగీకరించిందని… వైసీపీ డిమాండ్‌తోనే ప్రభుత్వం దిగి వచ్చిందంటున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పధకాల అమలు కూడా వైసీపీ నేతల వల్లే అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారానికి కూటమి నేతలు గట్టిగా జవాబివ్వకపోతే.. పని చేసినా కూడా ఫలితం లేకుండా పోతుందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్