Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

మొత్తం మీరే చేశారు.. ఇవిగో సాక్ష్యాలు..!

అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటున్నారు వైసీపీ నేతలు. ఎక్కడ ఏం జరిగినా సరే.. అది ప్రభుత్వం చేసిన తప్పు అని ప్రచారం చేస్తున్నారు. పైగా అందుకు బాధ్యులు మాత్రం ప్రభుత్వ పెద్దలు అని ప్రతి విషయంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ వాస్తవాలు ఇవి అని బయటపెడితే మాత్రం.. ఇక సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నారు. మరి దీనికి జవాబు ఏమిటి అని ప్రశ్నిస్తే చాలు.. మాకేం తెలియదు.. అంటూ పారిపోతున్నారు. తాము చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే మాత్రం.. అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు బుద్ది చెప్పినా కూడా వైసీపీ సైకోలు మారటం లేదు.

Also Read : మాట తప్పాడు.. మడమ తిప్పాడు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా పర్యటన సమయంలో సంబంధం లేని విషయాన్ని కూడా ప్రభుత్వానికే అంటగడుతున్నారు వైసీపీ సైకోలు. అరకు పర్యటనకు వెళ్తున్న సమయంలో పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపేశారు. అందువల్ల 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్లే ఆ విద్యార్థులు పరీక్షలకు సకాలంలో వెళ్లలేక పోయారని పలువురు ఆరోపించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతి నిరాకరిస్తారు. అయితే 30 మంది విద్యార్థులు 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని గేటు బయటే పోలీసులు ఆపేశారు.

Also Read : రాజధాని అమరావతికి మరో బిగ్ న్యూస్..!

పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా బయట కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా కేవలం పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫీక్ ఆపడం వల్లే అని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు పోలీసులు కూడా బాధ్యత వహించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. అయితే దీనిపై పోలీస్ శాఖ బదులిచ్చింది. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను 7 నుంచి 8.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. సరిగ్గా 8.30 గంటలకు పరీక్ష కేంద్రం గేటు మూసేస్తారు అనేది హాల్ టికెట్‌లో స్పష్టంగా ఉంది. అయితే ఉదయం 8.41 గంటలకు ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్‌ జంక్షన్ దాటి వెళ్లిందని వివరణ ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేదని కూడా వివరణ ఇచ్చారు. ముందే ట్రాఫిక్ ఆపినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న పోలీసులు.. విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Also Read : ఆసక్తి రేపుతోన్న చంద్రబాబు ఢిల్లీ టూర్

అంతేకాకుండా.. ఏప్రిల్ 2న పరీక్షలు ప్రారంభమయ్యాయని.. ప్రతి పరీక్ష రోజున 81, 65, 76, 61 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యాయని.. వీరిలో ఆలస్యమైన వారే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. అలాగే పరీక్షకు హాజరయ్యే వారి కోసం బీఆర్‌టీఎస్ రోడ్, గోపాలపట్నం-పెందుర్తి సర్వీస్ రోడ్‌లలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేవని కూడా స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపటం వల్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారంటూ వచ్చిన వార్తాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అసలు కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ఆపారు.. పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లలో ట్రాఫిక్ ఎలా ఉంది.. సర్వీస్ రోడ్‌ ఉందా.. అక్కడ ఆంక్షలు ఉన్నాయా.. అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని విశాఖ పోలీసులకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్