సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో ఆలోచించే ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు. ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో అయ్యో పాపం అనే వారే గాని ఆ విషయంలో రాజకీయాలు చేసేవారు తక్కువ. కానీ ఈ విషయంలో వైసిపి మాత్రం ముందు నుంచి భిన్నంగానే ఉంటుంది. ఏ ప్రమాదం జరిగిన సరే దానిని టిడిపికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఆ పార్టీ అధిష్టానం. ఇప్పుడు కర్నూలులో జరిగిన ప్రమాదం విషయంలో ఇదే తరహాలో వ్యవహరిస్తోంది వైసిపి. ఇందులో సామాజిక వర్గాలను కూడా లాగే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగించే అంశం.
Also Read : ఆర్టీసీ బస్సు తప్పింది.. కావేరి బలైంది.. కర్నూలు ఘటనలో సినీ ఫక్కీ సీన్లు
సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లేదంటే స్కూల్ బస్సులకు ఎల్లో కలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులకు పసుపు రంగు ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అతను టిడిపి నాయకుడని, అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుందంటూ కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న శివశంకర్, ఎర్రి స్వామి అనే యువకులు బెల్ట్ షాపులో మద్యం కొన్నట్లు వైసిపి ప్రచారం మొదలుపెట్టింది. పెట్రోల్ బంక్ లో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత.. వాళ్లు మద్యం సేవించి వాహనం నడిపినట్లు క్లారిటీ వచ్చింది.
Also Read : సస్పెండ్ చేస్తే తిరువూరు వచ్చే దమ్ముందా..?
ఇక అక్కడి నుంచి వాళ్లు బెల్ట్ షాపులోనే మద్యం కొన్నారని.. ప్రమాదానికి కారణం బెల్ట్ షాపులని విమర్శించడం మొదలుపెట్టింది వైసిపి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చింది. వాళ్లు లైసెన్స్ ఉన్న మద్యం దుకాణం లోనే మద్యం కొనుగోలు చేసినట్లు సిసి ఫుటేజ్ వీడియోలను బయటపెట్టింది. ఇక అతను తాగింది కల్తీ మద్యం అనే ప్రచారం కూడా చేయడం మొదలుపెట్టారు వైసీపీ కార్యకర్తలు. దీనిపై టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఏది ఎలా ఉన్నా 20 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో కూడా వైసిపి సోషల్ మీడియా ఈ స్థాయిలో ప్రచారం చేయడం మాత్రం ఆశ్చర్యకర విషయమే.




